ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర వ్యవసాయ విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు
పంటల బీమా సక్రమంగా అమలు కావట్లేదు
శాసన సభలో ముఖ్యమంత్రి చంద్ర బాబు

గుంటూరు, మార్చి 21: కేంద్ర వ్యవసాయ విధానంలో సమూలంగా మార్పులు రావాలి.. పంటల బీమా చెల్లింపు సక్రమంగాలేదు.. అందు వల్లే వృద్ధిరేటు పడిపోతోంది.. సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కేంద్రం ఇచ్చినా..ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. ఏ ఒక్క రైతుకీ ఇబ్బంది రానివ్వం..అన్నివిధాలా ఆదుకుంటాం..అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. శాసనసభలో బుధవారం వ్యవసాయంపై జరిగిన లఘుచర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 2014కు ముందు విత్తనాలు, ఎరువుల కొరత, నీటి ఎద్దడి కారణంగా రైతులు నిలువునా నష్టపోయారన్నారు. ఒక లాఠీ దెబ్బకు ఒక ఎరువుల బస్తా ఇచ్చే దైన్య పరిస్థితులు అప్పట్లో రైతులు చవి చూడాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదిలోనే 1978 మంది ఆత్మహత్యకు పాల్పడితే గత నాలుగేళ్లలో 262 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వీటిని ఇంకా నియంత్రించే దిశగా కార్యాచరణ రూపొందించామన్నారు.
ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నామని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 18 శాతానికి చేరిందన్నారు. జాతీయ స్థాయిలో మూడు శాతం మాత్రమే ఉందన్నారు. దేశం మొత్తంగా 34.4 శాతం జీఎస్‌డీపీ కంట్రిబ్యూషన్ కేంద్రానికి అందిస్తున్న ఘనత మనకే ఏపీకే దక్కు తుందన్నారు. వ్యవసాయంలో యాంత్రీకకరణను పెంచి సాంకేతికను దిగుమతి చేసుకోవటం ద్వారా నేల స్వభావానికి అనుగుణంగా పంటల సాగుని చేపట్టామన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వంగడాలను రైతులకు అందించటంతో పాటు రసాయన ఎరువులను తగ్గించి సాంప్రదాయక సాగును ప్రోత్సహించామన్నారు. ప్రజల మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఉద్యానవనాలు, పాడిపరిశ్రమ, ఆక్వా కల్చర్‌కు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తంగా 30లక్షల మంది రైతులకు భూ సార పరీక్షా ఫలితాల కార్డులు అందజేయటంతో పాటు 77వేల 783 మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలను అందించామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి డెల్టాలకు ముందుగానే నీరందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఖరీఫ్‌కు జూన్‌లోనే నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. రబీలో పంటలను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతుల అప్పులను ప్రభుత్వం మోస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం, రిజర్వు బ్యాంక్ సహకరించకపోయినా 24వేల కోట్ల రుణమాఫీని దశలవారీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులలో లోపభూయిష్టమైన విధానం కారణంగానే రైతులు నష్ట పోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ ద్వారా అపారమైన లాభాలు ఆర్జించ వచ్చన్నారు. పాడిపరిశ్రమలో దేశంలోకెల్లా రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రాష్ట్రం మొత్తంగా 308 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 194 ఏర్పాటయ్యాయని చెప్పారు. పశుగ్రాసం కొరతలేకుండా జాగ్రత్తలు తీసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. రానున్న కాలంలో మూడులక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాయలసీమలో రెయిన్‌గన్స్, భూగర్భజలాల వినియోగంతో పంటలు కాపాడాం..నంద్యాలలో మెగాసీడ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం..కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అరటి ఎగుమతులను మరింత పెంచుతామని తెలిపారు. కరవును ఇప్పటికే జయించాం.. 2024 నాటికి ప్రతి పంచాయతీ పరిధిలో వ్యవసాయంపై అవగాహన కల్పించే దిశగా విధాన రూపకల్పన జరుగుతోందని చెప్పారు. కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలి..జీడీపీలో తగ్గుదల ప్రభావం రాష్ట్రంపై పడుతోంది.. రైతుల్ని ఆదుకోమని అడిగేందుకే ఢిల్లీ చుట్టూ తిరిగాం.. ఇక కేంద్రం ఇవ్వకపోయినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అభివృద్ధిని స్వయంశక్తితో సాధిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.