ఆంధ్రప్రదేశ్‌

పరిశీలనలో రెవెన్యూ డివిజన్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఉన్న 51 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 16 ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, బొబ్బిలి, విశాఖ జిల్లాలో చోడవరం, చింతపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, కృష్ణాజిల్లాలో నందిగామ, గుంటూరు జిల్లాలో బాపట్ల, ప్రకాశం జిల్లాలో మార్టూరు, దర్శి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, కుప్పం, కడప జిల్లాలో బద్వేల్, కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆత్మకూరు, అనంతపురం జిల్లాలో గుంతకల్ రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉందని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా అదనంగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో మండలాల సంఖ్యను కూడా పెంచే యోచన ఉందన్నారు. తొలిదశలో 9 మండలాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో అదనంగా 3 అర్బన్ మండలాలు ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందన్నారు. భూ వినియోగ మార్పిడికి పన్ను రుసుములను తగ్గించామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. భూ మార్పిడికి సంబంధించి ఈసేవా కేంద్రాల్లో ల్యాండ్ కన్వర్షన్ న్యూ పేరుతో ప్రత్యేక సదుపాయం కల్పించామన్నారు. రిసీప్ట్ ఆఫ్ ఇంటిమేషన్ జనరేట్ అయిన తరువాత దరఖాస్తుదారు తన భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.