ఆంధ్రప్రదేశ్‌

ఖర్చు కాదు, ఫలితాలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: ప్రజా సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఒక్కటే ముఖ్యం కాదని, ఉత్తమ ఫలితాలు సాధించడం కూడా ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ప్రజల సంతోషం ప్రాతిపదికగా అన్ని శాఖల పనితీరు ఉండాలని చెప్పారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 5వ సమాశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. దళిత వాడల్లో, గిరిజన తండాల్లో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరగాలని, మరింత మందికి లబ్ధి చేకూరేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీల తలసరి ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో రాజీ పడొద్దని, కేంద్రానికి కావాల్సిన నివేదికలు అందించి మరీ నిధులు రాబట్టాలని స్పష్టం చేశారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.9,847.13 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, ఇప్పటివరకు రూ.8,995.34 కోట్లు వినియోగించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ.3,528.75 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.3009.64 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి 2018-19 సంవత్సరానికి కేటాయింపులు
భూ కొనుగోళ్లకు రూ.25 కోట్లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి రూ.90 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో మార్కెటింగ్ వౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు, మాతా, శిశు ఆరోగ్యానికి పౌష్టికాహారం కోసం రూ.80 కోట్లు. చంద్రన్న పెళ్లి కానుకకు రూ.100 కోట్లు, డప్పు కళాకారులకు పింఛన్ల కోసం రూ.12 కోట్లు, భూ కొనుగోళ్ల కోసం రూ.100 కోట్లు, మాతా, శిశు ఆరోగ్యానికి పౌష్టికాహారం కోసం రూ.200 కోట్లు. ఎస్సీ, ఎస్టీ నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారంతో రూపొందించిన న్యూస్ లెటర్‌ను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.