ఆంధ్రప్రదేశ్‌

సారీ.. నా వ్యాఖ్యలు వెనక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: హోదాకు సంబంధించి సినిమా పరిశ్రమపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అంతకుముందు ఉదయం ఎంపీలతో చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సినీ పరిశ్రమపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దాంతో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించవద్దని బాబు ఆదేశించారు. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. ఎవరినీ బాధ పెట్టాలని మాట్లాడలేదు. సినిమా వాళ్లు కూడా ఉద్యమంలోకి వస్తే మేలు జరుగుతుందన్నదే నా భావన. చంద్రబాబుకు అండగా నిలవాలనే నా మాటల్లోని స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పడుతున్న కష్టానికి బాధ అనిపించే అలా మాట్లాడానన్నారు.