ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పూర్తయితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: పట్టిసీమతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనల మేరకే కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి పారుదల వ్యవస్థను వైఎస్ హయాంలో నిర్వీర్యం చేశారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పవిత్ర సంగమం ద్వారా పట్టిసీమతో కృష్ణాడెల్టాను ఆదుకుందని తెలిపారు. దీంతో శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీరందించ గలిగామన్నారు. ఈ ఏడాది జూన్‌లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి ఉమా మాట్లాడుతూ తాడిపూడి, పుష్కర ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. ప్రాజెక్టుల విషయంలో తక్కువ కోట్‌చేసిన సంస్థలకే పారదర్శకంగా కాంట్రాక్టు అప్పగిస్తున్నామన్నారు. కాగ్ నివేదికను సభకు ఎందుకు సమర్పించ లేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు గతంలో మాదిరిగా అదనపు చెల్లింపులు జరపలేదన్నారు. టెండర్ షెడ్యూళ్ల విషయంలో ఎక్కడా తేడాలు లేవన్నారు. పట్టిసీమ, పోలవరం హెడ్ వాటర్ వర్క్స్‌లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణ అవాస్తవమన్నారు. ఇందులో 30 పంపులకు గాను 24 అమర్చటం వల్ల అదనపు వ్యయాన్ని నియంత్రించ గలిగామన్నారు. హైకోర్టు సైతం ఇవి నిరాధారమైన ఆరోపణలుగా తోసిపుచ్చిందని గుర్తుచేశారు. లేబర్ సెస్, సెంట్రల్ ఎక్సైజ్ కూడా నిబంధనలకు అనుగుణంగానే చెల్లించామన్నారు. భవిష్యత్తులో వంశధార- నాగావళి, చంపావతి- వేదావతి నదులను అనుసంధానం చేయటం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలను సుసంపన్నం చేస్తామన్నారు. వచ్చే ఏడాది ఏలేరు రిజర్వాయర్‌ను పూర్తి చేయడం ద్వారా 2లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వ ఆధునీకరణ పనులను వేగవంతం చేయటంతో పాటు పెన్నా, గోదావరి డెల్టాలలో పెండింగ్ పనులు త్వరలో పూర్తి కాగలవన్నారు. నెల్లూరులో సంగం బ్యారేజీకి వెయ్యికోట్లు కేటాయించామన్నారు.