ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: రాష్ట్రంలో బలహీనవర్గాల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉప్పుపాతర వేశారని మంత్రి అచ్చన్నాయుడు మండిపడ్డారు. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పదేళ్ల క్రితం నిర్వీర్యమైన ఆదరణ పథకాన్ని 750 కోట్లతో పునరుద్ధరించి కులవృత్తుల వారికి అండగా నిలిచిందన్నారు. బీసీ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, అక్కడ పెండింగ్‌లో ఉంటే కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. కాపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను త్వరలో మంజూరు చేస్తామని వెల్లడించారు. శాసనసభలో గురువారం శాఖల వారీగా డిమాండ్లను ఆమోదించే అంశంలో భాగంగా బీసీలకు బడ్జెట్ కేటాయింపుపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గత పదేళ్ల కాంగ్రెస్ హయాంలో 9747 కోట్లు కేటాయించి 8490 కోట్లు మంజూరు చేశారని, ఇందులో 7815 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కాగా తమ ప్రభుత్వం నాలుగేళ్లలో 15వేల 998 కోట్లు కేటాయించి 15వేల 587 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రతి జిల్లాలో రూ 5 కోట్లతో బీసీ భవన్‌ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇకపై ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో కూడా బీసీ భవన్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. అత్యంత వెనుకబడిన 37 కులాలను గుర్తించి వారి సంక్షేమానికి 60 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు బీసీ కార్పొరేషన్‌ను వైఎస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. బ్యాంకర్లు సహకరిస్తే మరింత ఖర్చు పెట్టి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రన్న పెళ్లి కానుకగా 35 వేలు అందిస్తామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించామన్నారు. 11 బీసీ ఫెడరేషన్లకు గత పదేళ్లలో 19 కోట్లు ఖర్చుపెడితే తమ ప్రభుత్వం 680 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.