ఆంధ్రప్రదేశ్‌

మారుమూల ప్రాంతాల ప్రజల చైతన్యానికి నైపుణ్య రథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: సమాజంలో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలను చైతన్యపరచి శక్తివంతులుగా తీర్చిదద్దటమే నైపుణ్య రథాల లక్ష్యమని, మే నాటికి 12 రథాలు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం ఆయన నైపుణ్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వరల్డ్ ఆన్ వీల్స్ అనే పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఎంతో వినూత్నమైన ప్రాజెక్టని, హ్యూలెట్ ప్యాకర్డ్, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ సంయుక్త నిర్వహణలో రాష్టవ్య్రాప్తంగా నైపుణ్య రథం పరుగులు తీస్తుందన్నారు. 13 జిల్లాల్లోని 28 స్మార్ట్ గ్రామాల్లో ప్రాథమికంగా ఈ నైపుణ్య రథాలు ప్రారంభం కానున్నాయన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ పయనమవుతుందనీ, ఒక్కో గ్రామంలో 6రోజులు చొప్పున నైపుణ్య రథం ఉంటుందన్నారు. ప్రతిరోజూ 4గంటలు పాఠశాల విద్యార్థులకు, 3 గంటలు యువతకు, ఒక గంట ప్రజలకు అవసరమైన ఆధార్, మీ సేవ వంటి సేవలు అందిస్తుందని చెప్పారు. మరో 2 గంటలు ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు, వాటిని పొందటం ఎలా అన్న విషయాలపై అవగాహన కల్పిస్తుందని, ఇంటర్‌నెట్ ఆధారిత డిజిటల్ ప్రయోగశాలను ప్రజల వద్దకే పంపి, దాని ద్వారా అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో సేవలు అందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని ఇందుకు రూ.300 కోట్లు కేటాయింపు చేశామని, వెయ్యి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. 34 సాంకేతిక నైపుణ్య సంస్థలు, 6 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ కార్యక్రమాలను జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థ భాగస్వామ్యంతో లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు.

చిత్రం..నైపుణ్య రథాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు