క్రైమ్/లీగల్

ఎన్‌కౌంటర్‌లో మావోయస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 24: ఒడిశా-్ఛతీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీనా విలేఖర్లకు వెల్లడించారు. ఒడిశా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన తులసిడొంగ్రీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో డిస్ట్రిక్ వాలంటీర్ పోలీసులు, ఎస్‌వోజీ బలగాలు శనివారం ఉదయం కూబింగ్ నిర్వహిస్తుండగా తులసిడొంగ్రీ అటవీ ప్రాంతంలో మావోలు తారసపడ్డారు. మావోలు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురుకాల్పులు జరిపగా, ఎసీఎం క్యాడర్ కలిగిన మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించగా ఒక ఫిస్టల్, కిట్ బ్యాగ్‌లు, విప్లవ సాహిత్యాలు లభించాయని చెప్పారు. వీటిని ఎస్పీ కార్యాలయానికి తరలించామని, మృతి చెందిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందని ఒడిశా పోలీసులు తెలిపారు.