ఆంధ్రప్రదేశ్‌

ముందస్తు ఆమోదాలు..ఆనక చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: ప్రతిపక్ష సభ్యులు లేకపోయినా శాసనసభలో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రపక్షమైన బీజేపీతో అధికార టీడీపీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వాదోపవాదాలు చోటు చేసుకోవటం ఒక ఎత్తయితే సభలో చర్చించాల్సిన అంశాలను సకాలంలో చర్చించలేకపోతున్నామని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేయటం విశేషం. ఈ ఏడాది రాష్ట్ర అంచనా బడ్జెట్ ఆమోదం అనంతరం మంత్రులు శాఖల వారీగా డిమాండ్లపై వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతకు ముందు అధికార, ప్రతిపక్ష సభ్యులు దీనిపై చర్చించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా కొన్ని శాఖలకు సంబంధించి ముందుగా ఆమోదాలు.. ఆపై చర్చలు సాగుతున్నాయి. దీంతో సభా నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్యం తదితర శాఖలకు సంబంధించి మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు ముందుగానే వివరణ ఇచ్చిన అనంతరం కొందరు శాసనసభ్యులకు మాట్లాడే అవకాశం వచ్చింది. శుక్రవారం సభలో రవాణా రంగంపై ఎమ్మెల్యే రమణయ్య మాట్లాడుతూ గత నాలుగేళ్లలో 16వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారన్నారు. గత కాంగ్రెస్ హయాంలో కొద్ది మంది ఉండే చోటే రహదార్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇదే అంశంపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాజధాని అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం ఎందుకు నిధులు మంజూరు చేయదని ప్రశ్నించారు. భూ సేకరణను కూడా భరించాల్సిన కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇంతలో కేటాయించిన సమయం ముగియడంతో స్పీకర్ మైక్ నిలిపివేసి మరో సభ్యునికి అవకాశమిచ్చారు. ఇదే సమయంలో స్వయాన స్పీకర్ కోడెల నిర్ణీత వ్యవధికి మించి మాట్లాడుతున్న శాసనసభ్యులనుద్దేశించి టైం పూర్తయింది.. డిమాండ్లు ఇప్పటికే ఆమోదం పొందాయి.. ఇక ముగించండని ఆదేశించడం గమనార్హం. కాగా బలహీన వర్గాల సంక్షేమశాఖ డిమాండ్లపై గురువారం మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. దీనిపై శుక్రవారం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణకు మాట్లాడే అవకాశం రాగా బీసీ సబ్‌ప్లాన్‌ను అమలుచేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడాది 12వేల కోట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుకగా యువతులకు 35వేల ఆర్థిక సాయంతో పాటు యువత స్వయం ఉపాధికి లక్ష సబ్సిడీతో రెండులక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. మరో ఎమ్మెల్యే చిరంజీవులు వైద్య, ఆరోగ్యశాఖపై మాట్లాడారు. బడ్జెట్ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పదవికి రాజీనామా చేశారు. దీంతో డిమాండ్ లేకుండానే చర్చ జరిగింది. దీనిపై చిరంజీవులు మాట్లాడుతూ చంద్రన్న సంచార వైద్యశాలలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను ప్రస్తావించారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాటి అజెండాలో నీటిపారుదలపై లఘు చర్చ కొనసాగించాల్సి ఉండగా దీనిపై గురువారంనాడే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఇక మైనారిటీ సంక్షేమం గురించి కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్‌లో హజ్‌హౌస్‌ను హోటల్‌గా మార్చాయని, అసాంఘిక శక్తులు తలదాచుకున్నారని ఆరోపించారు. కాగా తమ ప్రభుత్వం విజయవాడ, కడపలో హజ్‌హౌస్ నిర్మాణాలు చేపట్టి గన్నవరం నుంచి నేరుగా మక్కా వెళ్లే సౌకర్యం కల్పిస్తోందని తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో దుల్హన్ పథకం ద్వారా వివాహానికి ఆర్థిక సాయంగా 50వేలు అంద జేయటంతో పాటు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కేటాయించిన సమయం ముగియటంతో స్పీకర్ మైక్ కట్‌చేసే క్రమంలో మైనారిటీల పక్షాన ఒకడిగా ఉన్న తనకు మరో పదినిముషాల వ్యవది ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. మరింత వ్యవధి పట్టటంతో స్పీకర్ మైక్ కట్‌చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్ర విధానాల కారణంగా ప్రాధాన్యత అంశాల్లో కూడా చర్చించే సమయం రావటంలేదని పలువురు అధికార పార్టీ సభ్యులే వ్యాఖ్యానిస్తున్నారు.

త్వరలో హోంగార్డుల వేతనాలు పెంపు
గుంటూరు, మార్చి 23: హోంగార్డుల వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం హోంశాఖ డిమాండ్లపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు మెరుగైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయగలిగామన్నారు. శాంతి భద్రతలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా ఈ ఏడాది అంచనా బడ్జెట్‌లో 6,225 కోట్ల 44 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేశామన్నారు. అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించామని, దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. తీవ్రవాదులను అణచి వేసేందుకు గ్రేహౌండ్స్ విభాగాన్ని పటిష్టం చేశామన్నారు. రాష్ట్రంలో మోడల్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలతో పోలీసు సిబ్బంది మమేకం అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. మహిళలకు మహిళా పోలీసుస్టేషన్లను విస్తృతం చేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా కేసులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ర్యాగింగ్ నియంత్రణకు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందని తెలిపారు.