ఆంధ్రప్రదేశ్‌

బీజేపీయే అడ్డుకుంటోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 23: పార్లమెంటులో ఉన్న గందరగోళ పరిస్థితులను లెక్కచేయకుండా ఏ తరహాలో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించారో అదే తరహాలో ప్రస్తుతం కేంద్రంపై వైసీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్‌చేశారు. నాడు పార్లమెంటులో ఇంతకన్నా ఎక్కువ గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, అయినా విభజన బిల్లును ఆమోదించారని, అలాంటిది ప్రస్తుతం సభ సజావుగా లేదని పేర్కొంటూ అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా పార్లమెంటును వాయిదా వేయడం దారుణమన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ 2014 ఫిబ్రవరి 18వ తేదీన రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు మొత్తం 351 మంది సభ్యులకుగాను 111 మంది స్పీకర్ వద్ద ఉన్న వెల్‌లోనే ఉండి ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నాటి స్పీకర్ మీరా కుమార్ విభజన బిల్లుపై మద్దతు ఇచ్చినవారిని లెక్కించి బిల్లును ఆమోదింపజేశారన్నారు. ఆనాటి సభలో నేటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కూడా సభ్యురాలిగా ఉండి, విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని ఉండవల్లి గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంటులో ఆందోళన చేస్తున్న వారి సంఖ్య 20 మందికి మించి లేదన్నారు. ఆనాడు సభలో ఉన్న నేటి స్పీకర్ విభజన బిల్లుపై ఎలా ఆమోదం తెలిపారని నిలదీశారు. లేనిపక్షంలో 2014లో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సభలో తప్పు జరిగిందని అంగీకరించాలని సుమిత్రామహాజన్‌ను డిమాండ్ చేశారు. నేడు సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో అవిశ్వాసంపై చర్చ చేపట్టలేమని ప్రకటించడం శోచనీయమన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఇరు పార్టీలకు చిత్తశుద్ధి లేదని, ప్రజలను మభ్యపెట్టేందుకే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి విమర్శించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా వెళ్లి స్పీకర్‌ను కలిసి ఆనాటి పరిస్థితులను వివరించి, నేడు కూడా అదే విధానాన్ని అవలంబించాలని డిమాండ్ చేయాలని సూచించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఉండవల్లి ఆరోపించారు. ఒక్క అవిశ్వాస తీర్మానంపై చర్చ మినహా మిగిలిన బిల్లులను ఎలా ఆమోదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సినీనటుడు శివాజీ ఆపరేషన్ గరుడ ప్రణాళిక అబద్ధమని, అలాంటి ఛాయలేమి కనిపించడం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.