ఆంధ్రప్రదేశ్‌

ఈశాన్య రాష్ట్రాలకు అనే్నసి నిధులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఒకవైపు ప్రజాందోళనలు , మరోవైపు పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. న్యాయం చేయమని అడుగుతున్న ఏపీకి ఇవ్వాల్సిన నిధుల్లో రోజుకో కోత విధిస్తూ, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం రూ.3వేల కోట్లు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించడం దారుణమని ఆయన విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో 19 అంశాలు, పార్లమెంటు ఇచ్చిన 6 హామీలు పూర్తిగా నెరవేర్చాలని 5కోట్ల మంది చేస్తున్న డిమాండ్‌ను నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నామని శుక్రవారం నాడొక ప్రకటనలో అన్నారు. సాంకేతికంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అబద్ధాలు చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు హోదా వల్ల లభించే ప్రోత్సాహకాలను కొనసాగించడం అనైతికమన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులుగా అందించిన రూ.350 కోట్లను పీఎంవో అనుమతి లేదని వెనక్కు తీసుకోవడం, తాజాగా పోలవరానికి కేటాయించిన రూ.1400 కోట్లలో మరో రూ.300 కోట్లు కోత విధించడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలున్నాయన్నారు. ప్రజల హక్కులు కాపాడడం కోసమే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని రామకృష్ణుడు తెలిపారు., గత 10 రోజులుగా టీడీపీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింప చేసి రాష్ట్రానికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంటే కేంద్రం కబోదిలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రూ.లక్ష కోట్ల అవినీతి కేసులో ఎ1, ఎ2గా ఉన్న ప్రధాన నిందితులు ముఖ్యమంత్రిపై సభాహక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందని, పదేపదే ప్రదక్షిణల ద్వారా పీఎంవోను కించపరిచింది విజయసాయిరెడ్డేనన్నారు. గత నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక్క విమర్శ చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవినీతి, ఆరోపణలు చేయడం వెనుక ఉన్నదెవరు? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన మూడేళ్ల తరువాత, రూ.30వేల కోట్ల ప్రయోజనం పొందాక, ఇప్పుడు రూ.300 కోట్లు ప్రజాదనం దుర్వినియోగమైందని విష్ణుకుమార్‌రాజు సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులను కలవద్దు!
హోదా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మనం కేంద్రంలోని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడుతున్న సమయంలో మనం వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం తప్పుడు సంకేతాలకు కారణమవుతుందని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. శుక్రవారం ముఖ్యమంత్రి జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా అన్నీ ఇస్తామన్నారని, హోదా గురించి మాత్రం చెప్పలేదని ఆర్థిక మంత్రి జైట్లీతో జరిగిన సంభాషణ వివరాలను సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. దానికి స్పందించిన యనమల అన్ని విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, వాళ్లు ఎక్కడైనా కనిపించినప్పుడు మర్యాదగా పలకరించుకోవచ్చని, కానీ.. ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో చంద్రబాబు కూడా ఏకీభవించారు. కాగా పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్, నటుడు శివాజీ గురువారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎవరో ఏదో చెబుతుంటారు.. అవన్నీ మనం పరిశీలిద్దామన్నారు.