ఆంధ్రప్రదేశ్‌

నవోదయంతో సారా రహిత సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: రాష్ట్రాన్ని సారా రహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ స్పష్టంచేశారు. శుక్రవారం శాసనసభలో ఎక్సైజ్ శాఖ డిమాండ్లపై ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు 3 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు చేరాయని, బెల్టుషాపులను విస్తృతం చేశారని విమర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా నార్కోటిక్స్, గంజాయి రవాణా జరుగుతున్నా నాటి ప్రభుత్వానికి పట్టలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రిస్తోందని చెప్పారు. గత ఏడాది బెల్టుషాపులపై దాడులు నిర్వహించి 10,687 కేసులు నమోదు చేశామని, దశల వారీ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.
ఆధ్యాత్మిక పరిరక్షణలో యువతకు భాగస్వామ్యం
తిరుపతి, మార్చి 23: విదేశీ విష సంస్కృతి వైపు దృష్టిసారిస్తున్న యువతను భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మిక పరిరక్షణలో భాగస్వాములను చేయడమే ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల ప్రధాన లక్ష్యమని చిత్తూరు జిల్లా కల్టెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూ తారకరామా క్రీడామైదానంలో మూడు రోజులపాటు జరుగనున్న ఆధ్యాత్మిక ఉత్సవాలను కలెక్టర్ జ్యోతివెలిగించి ప్రారంభించారు. మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా విదేశీ సంస్కృతి పెరుగుతోందన్నారు. ఆ విధానాన్ని మార్చడం కోసం యువతను కార్యోన్ముఖులను చేసి మన సంస్కృతి ఆధ్యాత్మిక పరిరక్షణకు భాగస్వామ్యం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. సంస్కృత విద్యాపీఠం విసి మురళీధర్ శర్మ మాట్లాడుతూ భారతీయ సభ్యతకు సంస్కృతం మూలం అని అన్నారు. ఈకార్యక్రమంలో ఎస్వీ వర్శిటీ వీసీ వీసీ దామోదరం, తదితరులు ప్రసంగించారు. , ఆధ్యాత్మిక వేత్తలు సముద్రాల లక్ష్మణయ్య, వి.పద్మాకర్ ప్రవచనాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాగా శిల్పారామంలో యోగ శిక్షణలో యోగా సనాలపై అవగాహన కల్పించారు.