ఆంధ్రప్రదేశ్‌

ట్రిపుల్ ఐటీ స్థల సేకరణపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీకీ సంబంధించి స్థల సేకరణపై మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం సమీక్షించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పోతుల రామారావు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. స్థల సేకరణ అంశంపై విస్తత్ర చర్చ జరిగింది. ఎక్కడ పెట్టాలనే అంశంపై ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుసుకున్నారు. రెండు రోజుల్లోగా మరోసారి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐఐటీ ఒంగోలు డైరెక్టర్ బసవరాజును మంత్రి గంటా ఆదేశించారు. సాధ్యాసాధ్యాలు, గతంలో జరిపిన పరిశీలనలను వివరించిన ఐఐఐటీ ఒంగోలు అధికారులు, కందుకూరు ఆర్డీవో మంత్రి గంటాకు వివరించారు. సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలని, ఆ నిర్ణయంలోపు స్థల సేకరణపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఐఐఐటీ ఒంగోలు డైరెక్టర్‌ను మంత్రి గంటా ఆదేశించారు.
రైతులకు రూ. 70 కోట్ల పంట పరిహారం
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: నెల్లూరు, కడప, కృష్ణా జిల్లాలలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమయింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బివై) పథకం కింద ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. సుమారు 17.69 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లింపులకు గాను ఆర్ధిక శాఖ జీవో నెం.295, వ్యవసాయ శాఖ జీవో నెం.115 విడుదల చేయించామన్నారు. జీవో విడుదల చేయడంతో రైతులకు మొత్తంగా 70 కోట్ల రూపాయల వరకూ ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించనున్నాయి. ఆయా జిల్లాలలోని 16 మండలాలకు చెందిన 26వేల మంది రైతులకు ఒకొక్కరికి 25 నుంచి 30వేల రూపాయల వరకూ బీమా చెల్లింపులు జరుగుతాయి. నష్టపోయిన పంటకు సంబంధించి బీమా సొమ్ము అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి సోమిరెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ప్రీమియం చెల్లింపులపై జీవోల విడుదల చేయించారు.