ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలు కేంద్రమే నెరవేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 23: విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మావోయిస్టు పార్టీ, ఏవోబీ ప్రత్యేక కార్యదర్శి చంద్రవౌళి స్థానిక విలేకరులకు శుక్రవారం పంపిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిపై చంద్రవౌళి తీవ్రంగా విమర్శించారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, అన్ని పార్టీల ఆమోదంతో విభజన చేశారన్నారు. ఆ తరువాత అధికారం చేపట్టిన బీజేపీ, టీడీపీ హిందూ మతోన్మాద అజెండా, ప్రపంచబ్యాంకు అభివృద్ధి అజెండాను అమలు చేసారన్నారు. ఏపీని దేశంలో ఆగ్రగ్రామిగా నిలబెడతామన్న సీఎం చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తిరిగి అధికారం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక అభివృద్ధి జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి తమ సొంత అజెండాపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలు బలమైన, న్యాయమైన ఆకాంక్షగా ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. పార్లమెంట్‌లో ఆవిశ్వాసలు, ప్ల కార్డులు, నిరసనలకు పరిమితం చేసి ప్రజలను పోరాటాలకు పిలుపునివ్వకుండా నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆలేఖలో పేర్కొన్నారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కందుకూరు, మార్చి 23: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను అక్రమంగా రవాణాచేసే ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా కందుకూరు డిఎస్పీ కె ప్రకాష్‌రావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిషేధిత ఖైనీ, గుట్కా అక్రమ రవాణాచేసే వారిపై నిఘా ఉంచడంతో కందుకూరు శివారు సిటిఆర్‌ఐ వద్ద గుట్కా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ముఠాగా ఏర్పడిన నలుగురు పాత నేరస్తులను పట్టుకుని విచారించగా వారి నుంచి నిషేధిక గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు వాటివిలువ 9 లక్షలు ఉంటుందన్నారు. వారు వాడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
వర్శిటీ ర్యాంకింగ్‌లపై 4న వర్క్‌షాపు
విజయవాడ, మార్చి 23: యూనివర్శిటీ ర్యాంకింగ్ పద్ధతులను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ టీమ్ స్టేట్ లెవల్ వర్క్‌షాపును నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4న నాగార్జున వర్సిటీలో జరిగే ఈ వర్క్‌షాపులో సంబంధిత భాగస్వాములు, అనుభవజ్ఞులు పాల్గొంటారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు, యూనివర్శిటీల ర్యాంకింగ్ మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉద్యోగస్తుల వారి సలహాలను తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు తెలిపారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల మాదిరిగా మన ప్రాంతీయ విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దేందుకు ఇటువంటి వర్క్‌షాపులు దోహదపడతాయని, బోధనలోనూ, ప్రయోగాల్లోనూ, జ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.