ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలపై చర్చ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 24: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాతీయస్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత తొలిసారిగా ఆయన శనివారం ఇక్కడకు విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశోక్‌బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన హామీలపై బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం, ఆ హామీలను చర్చకు తీసుకురాకపోవడం బాధాకరమన్నారు. అందువల్లనే గత్యంతరం లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని కోరామని తెలిపారు. ఏపీకి ఎన్ని పార్టీలు మద్దతునిచ్చాయని అడగ్గా ఇతర రాష్ట్రాల ఎంపీలు మనకు మద్దతునిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. జాతీయ పార్టీలకు రోగాలు వచ్చేశాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన దానిపై ఓటింగ్ నిర్వహించలేని స్థితిలో స్పీకర్ ఉన్నారని ఆయన విమర్శించారు. మరోపక్క ఎన్డీయే పాలనలో కొన్ని మంచి పనులు జరిగాయన్నారు. తనకు అప్పగించిన పౌరవిమానయాన శాఖ అప్పుల ఊబి నుంచి లాభాల బాటలోకి తీసుకురాగలిగామన్నారు. ఆ శాఖకు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని అందువల్ల ‘ఎరా’ చట్టానికి సవరణలు చేయాలని సూచించామని అశోక్ తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలను మన రాష్ట్రంలో కలపవడం వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అలాగే పేరుకుపోతున్న అవినీతి కేసులను ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పం చేసినప్పటికీ ఎందువల్లనో తాత్సారం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.