ఆంధ్రప్రదేశ్‌

అంబులెన్స్‌లో పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 23:రోడ్డు ప్రమాదంలో గాయపడిన పలువురు పదో తరగతి విద్యార్థులు సహాయకుల సాయంతో శుక్రవారం పరీక్ష రాశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బదినేహాల్ గ్రామం నుండి 20 మంది విద్యార్థులు ఆటోలో కౌతాళం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కౌతాళం క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో అందులోని 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే వీరికి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఆయా పరీక్ష కేంద్రాలకు తరలించారు. దీప, మహాదేవి, ఆఫ్రీన్, శిల్పా, నాగలక్ష్మి, ఈశ్వరి, శ్రావణి, నాగమ్మ, భీముడు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కృష్ణ, వీరేష్ సహాయకుల సాయంతో పది పరీక్ష రాశారు. కృష్ణ ఎడమ చేయి మణికట్టు విరిగింది. వీరేష్ తొడభాగం విరిగిపోయింది. వీరేష్ అంబులెన్స్‌లో సహాయకుని సాయంతో పరీక్ష రాశాడు. అలాగే కృష్ణ సైతం సహాయకుని సాయంతో పరీక్ష రాశాడు.