ఆంధ్రప్రదేశ్‌

కోదండ రాముని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల తరహాలో ఒంటిమిట్టలో ఏర్పాట్లు హాజరుకానున్న, గవర్నర్ ముఖ్యమంత్రి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్
ఒంటిమిట్ట, మార్చి 23: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలను తిరుమల వెంకన్న తరహాలో ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టకు వచ్చిన ఆయన ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కానీయమన్నారు. శ్రీరామనవమి, కల్యాణోత్సవం, రథోత్సవం, పుష్పయాగం పర్వదినాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
బ్రహ్మోత్సవాలకు హజరయ్యే 10 వేల మంది భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. కల్యాణం రోజు టీటీడీ భోజన వసతి కల్పిస్తుందన్నారు. కల్యాణం రోజు నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామన్నారు. 2 లక్షల ప్యాకెట్ల ముత్యాల తలంబ్రాలను కల్యాణం అనంతరం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 200 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరామనవమి నాడు భక్తులకు వడపప్పు, పానకం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ వస్తున్నట్లు ఈఓ తెలిపారు.
ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్తంగా హరికథా కాలక్షేపం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు టీటీడీ సిబ్బందికి జిల్లా అధికారులు సహయ, సహకారాలు అందించాలన్నారు. అనంతరం ఆయన స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.