ఆంధ్రప్రదేశ్‌

భూసేవతో ఇంటివద్దకే సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: రెవెన్యూ శాఖలో గత నాలుగేళ్లలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శాసనసభలో శుక్రవారం రెవెన్యూ శాఖ డిమాండ్లపై ఆయన వివరణ ఇచ్చారు. భూసేవ ద్వారా ఇంటి వద్దకే సమాచారాన్ని అందించడంతో పాటు భూధార్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు వివరించారు. ఉయ్యూరులో ఈ ప్రక్రియ ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. త్వరలో రాష్టమ్రంతటా అమలులోకి తెస్తామన్నారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అనాదిగా గ్రామాల్లో గ్రామకంఠాల సమస్య కారణంగా భూ వివాదాలు పెచ్చరిల్లుతున్నాయని, వీటిని పరిష్కరించి భూముల సర్వే రికార్డులను క్రమబద్ధీకరించామన్నారు. డాట్‌ల్యాండ్స్ సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఫీజు వసూళ్లు 4 వేల కోట్లుగా లక్ష్యాలను నిర్ధేశించినట్లు తెలిపారు