ఆంధ్రప్రదేశ్‌

హామీలు నెరవేర్చే వరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థల స్థితి’పై లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి మంజూరు కావాల్సిన 13 విద్యా సంస్థల్లో ఇప్పటివరకు ఏడింటికి మాత్రమే అనుమతి లభించిందని తెలిపారు. వీటికి కూడా కేవలం 138 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు, ఫ్యాకల్టీలు లేకపోవడంతో విద్యార్థులు వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం విభజన హామీలు నెరవేర్చే వరకు పార్టీలను పక్కనబెట్టి పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాత్కాలిక క్యాంపస్‌లలో తరగతులు నిర్వహిస్తుంటే ప్రశ్నిస్తున్నారని, కేంద్రం దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో విద్యాసంస్థలకు అన్నిరకాల అనుమతులు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.