ఆంధ్రప్రదేశ్‌

అభినవ కృష్ణదేవరాయలు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: కొన్ని వందల సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో హరిహరరాయలు, బుక్కరాయలు తవ్విన బుక్కపట్నం చెరువుకు నీటిని నింపిన సీఎం చంద్రబాబునాయుడు అభినవ కృష్ణదేవరాయలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు కురింపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నలపై సభలో తెదే సభ్యులు పలువురు బాబును ప్రస్తుతిస్తూ మాట్లాడారు. దానిపై మంత్రి ఉమా స్పందిస్తూ హంద్రీ-నీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానస పుత్రిక అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 2017-18లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.483.20 కోట్లు అయితే రూ.1154 కోట్ల 14 లక్షలు ఖర్చు చేశామనగా సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నామన్నారు. 30 లక్షల మందికి మంచినీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, కుప్పంలో సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ ద్వారా నీరందించబోతున్నామన్నారు. ఈనెల 31న లేపాక్షి ఉత్సవాలు సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారని అన్నారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులు వచ్చే మే నెలలో ప్రారంభిస్తామన్నారు.