ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఉత్తర నియోజకవర్గంపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: నేడు తాము విపక్షంలో ఉన్నాం.. గత నాలుగేళ్లపాటు మిత్రపక్షంగా ఉన్నాం.. అయినా తాను ప్రాతినిధ్యం వహించే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని.. ప్రభుత్వం మొదటి నుంచి వివక్ష చూపుతూ వచ్చిందంటూ బీజేపీ ఫ్లోర్‌లీడర్ వెష్ణుకుమార్‌రాజు ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ విశాఖలో టీడీపీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి, గాజువాక, సౌత్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గంలో రూ.1500 నుంచి 2వేల కోట్ల వరకు విలువైన పనులు జరిగినట్లు ఆ పార్టీ శాసనసభ్యులు కరపత్రాలు పంచుతున్నారు.. తన నియోజకవర్గంలో రూ.150 కోట్లకు మించి పనులు జరగలేదన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రైల్వే స్థలాల నుంచి చుట్టుపక్కల కాలనీ వాసుల కోసం రోడ్డు వేయడానికి రైల్వేశాఖ అనుమతించడం లేదని దీనిపై స్వయంగా తాను రైల్వే మంత్రికి లేఖలు రాశానని చెబుతుండగా టీడీపీ సభ్యులు షేమ్..షేమ్.. అంటూ బల్లలు చరిచారు.

సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు
* మంత్రి పుల్లారావు హెచ్చరిక
అమరావతి, మార్చి 23: మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పాత బకాయిలను చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అవసరమనుకుంటే ఆర్‌ఆర్ యాక్ట్ కింద ఆయా మిల్లుల యజమానుల నుంచి రికవరీ చేయాలని పౌర సరఫరాల శాఖకు చెందిన జిల్లా మేనేజర్లను ఆయన ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పుల్లారావు ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఎండీ సూర్యకుమారితో కలిసి 13 జిల్లాల డీఎంలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాల వారీగా మిల్లర్ల నుంచి రావాల్సిన పాత బకాయిలు, ధాన్యం సేకరణ, స్టాక్ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ రైస్‌కు సంబంధించి ఇంకా బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నాయని మంత్రికి డీఎంలు తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైస్‌మిల్లుల్లో బియ్యం లావాదేవీలు కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలని, ఏ.బీ రిజిస్టర్లను మిల్లర్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచుల సరఫరాలో ఎటువంటి అవకతవకలూ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.