ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇచ్చేది రూ.500 కోట్లు మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల్లో నిధుల వర్షం కురుస్తుందని, ఆ నగరాలు మొత్తం రూపురేఖలే మారిపోయి అభివృద్ధి చెందుతాయని భావిస్తే పొరబాటేనని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో స్మార్ట్ సిటీ నగరాల్లో వివిధ పనులు నత్తనడక నడుస్తున్నాయంటూ సభ్యులు వి.గణేష్‌కుమార్, ఎం.సుగుణమ్మ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారాయణ పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయని అన్నారు. కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలోనే అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. 500 ఎకరాల పరిధిలోనే స్మార్ట్‌సిటీ అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్రం ఇచ్చేది 500 కోట్ల రూపాయలేనని, అంతకు మూడింతలు రాష్ట్రం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. విశాఖ శాసనసభ్యులు కన్నబాబు, గణేష్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు తదితరులు మాట్లాడుతూ స్మార్ట్ పేరిట 30 ఏళ్లుగా రోడ్ల పక్కన, పుట్‌పాత్‌లపై తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారిని ఒక్కసారి తీసివేస్తే ఎలాఅని ప్రశ్నించారు. వారు ఎలా బతుకుతారన్నారు. ఇటీవలే ఒక హాకర్ తన కుమార్తెకు సకాలంలో స్కూల్ పీజు చెల్లించకపోవటంతో విద్యార్థిని ఉరివేసుకుందన్నారు. ఏది ఏమైనా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణకు బహుళ స్థాయి పార్కింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు.