ఆంధ్రప్రదేశ్‌

మాణిక్యాలరావుకు ఢిల్లీ పిలుపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్షుడితోపాటు, కార్యవర్గాన్ని కూడా ప్రకటించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు ప్రముఖులతో ప్రచార కమిటీ ఏర్పాటుచేసే అవకాశాలున్నాయంటున్నారు. అందులో భాగంగా కాపు నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదిలాఉండగా, మాజీ మంత్రి మాణిక్యాలరావును ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా చర్చలో ఉన్నాయి. వీరిలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆశీస్సులున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ వీరిలో ఒకరికి అధ్యక్ష పదవి దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తుండగా, కొత్తగా తెరపైకి మాణిక్యాలరావు రావడం చర్చనీయాంశంగా మారింది. మాణిక్యాలరావు పార్టీలో తొలి నుంచీ పనిచేస్తున్నప్పటికీ, ఆయన మంత్రిగా ఉన్న నాలుగేళ్ల సమయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరని, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న విమర్శలున్న విషయం తెలిసిందే. పైగా ఇప్పుడున్న రాజకీయ సంక్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లే నేత అవసరమని విశే్లషిస్తున్నారు. సాత్వికుడిగా పేరున్న మాణిక్యాలరావులో ఆ దూకుడు తత్వం లేకపోగా, మిగిలిన వారితో కూడా పెద్దగా సంబంధాలు లేవంటున్నారు. పైగా కొద్దిరోజుల క్రితం వరకూ టీడీపీ క్యాబినెట్‌లో ఉండి, ప్రభుత్వ పక్షాన మాట్లాడి, పుష్కరాల సమయంలో విగ్రహాల కూల్చివేతల సమయంలో నిస్సహాయంగా వ్యవహరించి, ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి తీసుకుంటే విమర్శలపాలయ్యే అవకాశం ఉందని విశే్లషిస్తున్నారు. టీడీపీ విమర్శలపై ఎదురుదాడి, అదే స్థాయిలో వ్యూహరచన, రాష్ట్రంలో అందరికీ తెలిసిన స్థాయి, వీటికిమించి ఎదురుదాడిలో రాటుదేలిన అనుభవం ఉన్న కాపునేతకు ఇస్తేనే టీడీపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాంమాధవ్ ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉందంటున్నారు.