ఆంధ్రప్రదేశ్‌

విమానం టిక్కెట్ బుక్‌చేస్తా.. హోటల్ ఖర్చులూ భరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: రాష్ట్రంలోని ఐటీ పాలసీకి లోబడే వివిధ కంపెనీలకు భూములను కేటాయిస్తున్నాం కానీ, గతంలో మాదిరిగా పందారం చేయడం లేదంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో బీజేపీ ఫ్లోర్‌లీడర్ పెన్మత్స విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఐటీ కంపెనీల పేరిట భూ పందారం జరుగుతుందంటూ చేసిన ఆరోపణలను మంత్రి లోకేష్ ప్రస్తావిస్తూ తమ విధానాన్ని విమర్శించే వారెవరైనా సరే ముందుకు వస్తే విమానం టిక్కెట్ బుక్ చేస్తా.. హోటల్ ఖర్చులు భరిస్తా.. ఒక్క ఐటీ కంపెనీని తీసుకురాగల్గితే 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని సవాల్ చేశారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు గృహ నిర్మాణం కోసం అదనంగా భూములు కేటాయించాలని కోరుతున్నందున ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయించక తప్పడం లేదన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లోపు సిబ్బంది గృహ నిర్మాణాలపై కాకుండా వేగవంతంగా ఉత్పత్తి ప్రారంభించాలని కోరుతున్నామని చెప్పారు. సైబరాబాద్‌ను తలదనే్నలా నాలుగు ప్రాంతాల్లో అద్భుత నగరాలను నిర్మిస్తామని అన్నారు.