ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లో హోదా సెంటిమెంట్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలన్న సెంటిమెంట్ లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ టీడీపీ బురద జల్లుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సుధీష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నాయకులతో కుమ్మక్కై తమపై కుట్ర చేస్తున్నట్లు తెలుగుదేశం నాయకులు పదేపదే ఆరోపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం గురువారం రాష్ట్రంలో నిర్వహించిన రాస్తారోకో విజయవంతం కాకపోవడాన్ని బట్టి ప్రజల్లో హోదా సెంటిమెంట్ లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఇష్టారాజ్యంగా వాడినందున వాటిపై కేంద్రం నుంచి విచారణ ఎదుర్కొనే భయంతో చంద్రబాబు తీవ్ర వత్తిడికి లోనై అభద్రతాభావంలో ఉన్నట్లు కనిపిస్తోందని భాజపా నాయకురాలు, సినీనటి కవిత విమర్శించారు.
అమృత్ పనులకు పాలనా ఆమోదం
విజయవాడ, మార్చి 23: రాష్ట్రంలో పురపాలక సంఘాల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (అమృత్) పథకం కింద 494.7 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు పాలనా ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మంజూరు చేసింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1056 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. రెండో విడత నిధుల మంజూరులో భాగంగా కేంద్రం 319.9 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మిగిలిన 40 శాతం కింద రాష్ట్ర ప్రభుత్వం 174.9 కోట్ల రూపాయలు కేటాయించింది. రెండు కలిపి 494.7 కోట్ల రూపాయలకు పాలనా ఆమోదాన్ని ప్రభుత్వ తెలిపింది.
మీసేవ సర్వీస్ చార్జీల పెంపు
విజయవాడ, మార్చి 23: మీ సేవ కేంద్రాల ద్వారా అందించే వివిధ సేవల సర్వీస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఎ-కేటగిరికి సంబంధించి ప్రస్తుతం ఉన్న 25 రూపాయలను 35 రూపాయలకు, బి-కేటగిరీ సేవలకు 35 రూపాయల నుంచి 45 రూపాయలకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.