ఆంధ్రప్రదేశ్‌

అసలు ఎవరికుంది సంతృప్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మార్చి 24: గత నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో సమాజంలోని ఏ వర్గమైనా సంతృప్తిగా ఉందా అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు, రైతుకూలీలతో పాటు ఏ వర్గం కూడా సంతోషంగా లేరన్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో 310 టిఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, నవంబర్ ఒకటో తేదీ నాటికి 274 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అయినప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి సాగుచేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిల్లో ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసర, కంది, మొక్కజొన్న, శనగ తదితర పంటలను సాగుచేశారన్నారు. కాలం కలిసి వచ్చి పంట పండినప్పటికీ గిట్టుబాటుధరలేక రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. మార్కెట్ ధరకు, ప్రభుత్వ ధరకు రెండు వేలకు పైగా తేడా ఉన్నప్పటికీ ప్రభుత్వ ధరకు రైతుల వద్ద నుండి పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. సబ్సిడీపై వచ్చే వ్యవసాయ పనిముట్లు కూడా లంచాలు స్వీకరించి టీడీపీ వారికే ఇస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్ళ నుండి సాగర్ కుడి కాలువ కింద నీరు విడుదల చేయడంలేదని, అదే పరిస్థితిలో తెలంగాణాలో సాగుకు నీరు అందించే ఎడమ కాలువ ద్వారా ఈ నాలుగేళ్ళు కేసీఆర్ సాగునీరు అందించారన్నారు. దీంతో తెలంగాణాలో వరి సాగు ముమ్మరంగా ఉండి, కరవులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు ఉన్నదేమిటీ? మన సీఎం చంద్రబాబుకు లేని దేమిటని చాలామంది తనను ప్రశ్నించారని ఈ సందర్భంగా తెలిపారు. ఆడియో, వీడియో టేపుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయాలు కేసిఆర్ దగ్గర ఉన్నాయని, రైతులకు నీరిచ్చే దమ్ము, ధైర్యం మన సీఎంకు లేవన్నారు. రాష్ట్రంలో వ్యాపార వర్గాలు జీఎస్టీతో బాధపడుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనైతే జీఎస్టీతోపాటు తెలుగుతమ్ముళ్ల సర్వీస్ టాక్స్ (టీఎస్టీ), మరీ ముఖ్యంగా నరసరావుపేటలో జీఎస్టీ, టీఎస్‌టీతో పాటు, కేఎస్టీ (కోడెల సర్వీస్ టాక్స్) కూడా వ్యాపారస్థులు చెల్లించాల్సి వస్తోందన్నారు. నరసరావుపేటలో రైల్వే కాంట్రాక్టర్ల నుండి రైతుల దాకా, విద్యుత్ కాంట్రాక్టర్ల నుండి కోటప్పకొండ కాంట్రాక్టర్ల దాకా, మద్యం షాపుల నుండి ఆటోల వరకు, అపార్ట్‌మెంట్ నిర్మాణాల్లో కూడా కేఎస్టీ చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా లంచంతోనే పరిపాలన నడుస్తుందన్నారు. తనను బలహీన పరిస్తే రాష్ట్రం , ప్రజలు బలహీన పడతారని చెబుతుంటారని, తప్పులు చేయమని సీఎంను ఎవరూ ప్రోత్సహించలేదన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని క్షమించకూడదన్నారు. క్షమిస్తే ఎన్నికలప్పుడు మళ్ళీ వచ్చి మరిన్ని అబద్ధాలు చెబుతాడని అన్నారు. తన పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకం ద్వారా ప్రజలకు మేలు చేయడానికి శతధా కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.