ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ ద్రావిడపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 24: సినీ నటుడు శివాజీ పేర్కొన్న ఆపరేషన్ ద్రావిడ వెనుక ఉన్నవారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీ మాలకొండయ్యకు మాజీ మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దక్షిణ భారతదేశంలోని రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ద్రవిడ పేరుతో ఒక జాతీయ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, గురు అని సంభోదించే వ్యక్తి దీని వెనుక ఉన్నట్లు సినీ నటుడు శివాజీ ఇటీవల విలేఖరుల సమావేశంలో తెలిపారన్నారు. ఇలాంటి ఆపరేషన్ రాజ్యాంగ నియమాలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ చర్యలతో ప్రజల్లో ఆందోళన చెలరేగడంతో అయోమయం నెలకొందన్నారు. అందువల్ల శివాజీ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ వెనుక ఉన్నవారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.