ఆంధ్రప్రదేశ్‌

దళితులు, మైనార్టీలను ఓటుబ్యాంకుగా వాడుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. శాసనసభలో శనివారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమానికి బడ్జెట్‌లో 25,850 కోట్లు కేటాయించగా ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద 8,737 కోట్లు మంజూరు చేశానని, ప్రతినెలా దీనిపై సమీక్షలు జరుపుతూ ప్రతి పైసాకు జవాబుదారీగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో భాగంగా 350 కోట్లు స్కాలర్‌షిప్‌లకు కేటాయించామన్నారు. వైఎస్ హయాంలో ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్ లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఈ ఏడాది 2,034 కోట్లతో ప్రణాళిక రూపొందించి ఎస్సీ కార్పొరేషన్, ట్రైకార్ ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. జూన్ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లోని 1500 హ్యాబిటేషన్లకు 850 కోట్లతో లింకురోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెల 14వ తేదీన రాజధానిలో అంబేద్కర్ స్మృతివనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారన్నారన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుబ్యాంకుగా వినియోగించుకుందని ఆరోపించారు. వైఎస్ హయాంలో పదేళ్లకు 580 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈ బడ్జెట్‌లో తమ ప్రభుత్వం 1,102 కోట్లు కేటాయించిందన్నారు.