ఆంధ్రప్రదేశ్‌

1 నుండి ‘సీఎఫ్‌ఎంఎస్’ విధానంలో బిల్లుల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ‘కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం’ (సీఎఫ్‌ఎంఎస్- సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం) ద్వారా ఏప్రిల్ 1 నుండి బిల్లుల చెల్లింపు పక్కాగా అమలుకానుంది. ఖజానా శాఖలో చెల్లింపులు వేగవంతం చేయటానికి ఈ ‘సీఎఫ్‌ఎంఎస్’ విధానం అమల్లోకి రానున్నది. ప్రస్తుతం ఈ శాఖలో జరుగుతున్న అక్రమాలను నివారించి, జాప్యాన్ని నివారించటానికి ప్రభుత్వం ఇ-పేమెంట్ స్థానంలో ‘కాంప్రహెన్సివ్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ సిస్టం’ అందుబాటులోకి రానున్నది. దీంతో బిల్లుల మంజూరులో పారదర్శకత సాధ్యమవుతుంది. లబ్ధిదారుల ఖాతాకు నేరుగా సొమ్ము జమ అవుతుంది. ఖజానా శాఖలో భారీ మార్పులకు నడుం బిగించిన ప్రభుత్వం రెండేళ్లుగా ఇ-పేమెంటు విధానంలో జరుగుతున్న చెల్లింపులకు బ్రేక్ వేయటానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే సీఎఫ్‌ఎంఎస్‌ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన సర్వర్లు ఏర్పాటు చేయటంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఖజానా కార్యాలయాలకు వౌఖిక సమాచారం కూడా అందింది. బిల్లుల చెల్లింపులో ఖజానాశాఖ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. ఆ శాఖలోని కొందరి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అనేకంగా ఉన్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అక్రమాలు, అవినీతి అడ్డుకట్టకు మీ-సేవా తరహాలో నూతన విధానం అమలు చేయనుంది. గతంలో బిల్లుల చెల్లింపు ఖాజనాశాఖ ద్వారా, బ్యాంకు ద్వారా జరిగేది. ఖజానా శాఖ ద్వారా 70కి పైగా ప్రభుత్వ శాఖల బిల్లుల చెల్లింపు ఇ-పేమెంట్ విధానంలో జరుగుతుంది. ఈ విధానంలో నెలవారీ ఖర్చు బిల్లులను ఆయా శాఖల డ్రాయింగ్ అధికారులు ఒక్కసారిగా ఖజానాకు సమర్పిస్తారు. వీటిని ఖజానాధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు కేటాయించిన నిధుల నుంచి ఆమోదం పొందిన మేరకు బిల్లులను ఆ శాఖ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. చెక్‌పవర్ ఉన్న అధికారులు సొమ్ము డ్రా చేసి నిర్వహణ ఖర్చుల కింద జమ చేస్తారు. ప్రస్తుత ఇ-పేమెంట్ విధానంలో కూడా అవినీతి జరుగుతున్నదని ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
ఈ క్రమంలోనే సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తీసుకురావాలని భావించారు. కొత్త విధానంలో ఖజానా ద్వారా చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వెళతాయి. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్, వాటర్, టెలిఫోన్ తదితర నిర్వహణ బిల్లులను నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తారు. మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల సరఫరా, దుప్పట్ల కొనుగోలు, ఆయా నిర్వాహకులు, టెండర్‌దారుల ఖాతాల్లో జమ అవుతాయి. బిల్లుల కోసమే కాకుండా పెన్షనర్లు కూడా తమకు రావాల్సిన రాయితీల కోసం ట్రెజరీ కార్యాలయాల మెట్లు ఎక్కకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.