ఆంధ్రప్రదేశ్‌

పాత్రికేయుల సంక్షేమానికి కృషి మంత్రి కాలవ హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వారి సాధక బాధలు పూర్తిగా తనకు అవగాహన ఉండటంతో పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమానికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పదేళ్ల పండుగ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మంత్రులు కాలవ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌లను ఉద్దేశించి మంత్రి కాలవ మాట్లాడుతూ ఒక సంస్థ 10 సంవత్సరాల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలకపాత్రను పోషించడంతో పాటు విలువలను పరిరక్షించే విధంగా పనిచేయడం మంచి పరిణామమన్నారు. ఒకపక్క పాత్రికేయ విలువలను పునరుద్ధరిస్తూ వారి సంక్షేమానికి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కృషి చేయడం అభినందనీయమన్నారు. పాత్రికేయ వృత్తి ముఖ్యంగా విలువల పరిరక్షణ, సంక్షేమం, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత్రికేయుడు తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్ధాకలితో ఉండే వ్యక్తుల గురించి రాసే పాత్రికేయుడు తన ఆకలి బాధలను దిగమింగి ప్రపంచానికి తన మేధస్సును ఆవిష్కరిస్తాడన్నారు. నేను కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, వారి మంచి చెడులు తనకు తెలుసునన్నారు. మనం రాసే ప్రతి అక్షరం జవాబుదారీతనంతో కూడినదిగా ఉంటేనే ప్రజలను చదివిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల గృహ నిర్మాణానికి నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తన తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాజధాని అమరావతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు 10వేల ఇళ్ల నిర్మాణం చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తుదిరూపు వస్తుందన్నారు. మృతి చెందిన జర్నలిస్ట్‌ల కుటుంబాలకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ కాకుండా 3వేల రూపాయలు పింఛన్ ఇచ్చే విధానాన్ని ఆలోచిస్తున్నామన్నారు. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జర్నలిస్ట్‌ల సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు ప్రకటించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనమన్నారు. పాత్రికేయుల రక్షణకు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ అండదండలు అందిస్తుందన్నారు. కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రన్న బీమాలో పాత్రికేయులను కూడా చేర్చే విషయం ముఖ్యమంత్రితో చర్చించి పరిశీలిస్తామన్నారు. పాత్రికేయ రంగం అంటేనే విలువలు, సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు.