ఆంధ్రప్రదేశ్‌

సిబ్బందిని తగ్గిస్తే సమరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ఏపీఎస్ ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాకపోయినప్పటికీ బస్సుల కుదింపు, సిబ్బంది తగ్గింపుతోనే ఆయా నష్టాలను తగ్గించగలమంటూ కుట్ర పూరితంగా ఆలోచిస్తున్న వైనం గర్హనీయమని ఎంప్లారుూస్ యూనియన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ సహాయ సహకారాలతోనే ఆర్టీసీ ఇటువంటి కుట్రలకు పూనుకొంటోందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్, అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హనుమంతరావు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి సుబ్రమణ్యంరాజు పేర్కొన్నారు. ఈనెల 20న ఇచ్చిన సర్క్యూలర్ నెంబర్ 07 ద్వారా ఏ జిల్లాలో ఎంత మందిని తగ్గించాలో టార్గెట్లు ఇచ్చి ప్రస్తుతం ఉన్న బస్‌స్ట్ఫా రేషియో 5.23ని 5.00కి తగ్గించారన్నారు. దీనితో 1910 మంది కండక్టర్లు, డ్రైవర్లను రాష్ట్ర వ్యాప్తంగా తగ్గించాలని ఇచ్చారని, కార్మికులను నష్టపర్చే ఈ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్టీసీ యాజమాన్యానికి యూనియన్ తరఫున లేఖ ఇచ్చినట్టు పేర్కొన్న వారు యాజమాన్య చర్లను నిరసిస్తూ మొదటి దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలు, నాలుగు జోన్ల వర్క్‌షాపుల వద్ద ధర్నాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్క్యులర్‌ను రద్దు చేయకుంటే ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బంది కుదింపు ప్రక్రియలో భాగంగా 600 కాంట్రాక్ట్ డ్రైవర్లు, 300 మంది కండక్టర్లను తొలగించారన్నారు. తక్షణమే ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.