ఆంధ్రప్రదేశ్‌

ఆ ఒక్కటైనా ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మంజూరు చేసిన పీజీ సీటుపై సందిగ్ధత కొనసాగుతోంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పీజీ కౌన్సిలింగ్‌లో పెంచిన ఆ ఒక్క సీటు లేకపోవడం గమనార్హం. దేశంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను ఎంసీఐ పెంచింది. పీజీ సీట్లకు సంబంధించి అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తిని 1:1.2 నుంచి 1:1.3కి పెంచుతూ ఎంసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక వైద్య కళాశాలలు లబ్ధి పొందాయి. ఈ నిర్ణయం వల్ల దేశంలో 604 పీజీ సీట్లు పెరిగాయి. రాష్ట్రానికి మాత్రం ఓకే సీటు అదనంగా దక్కింది. తెలంగాణకు 24 సీట్లు, ఉత్తరప్రదేశ్‌కు 29, పశ్చిమ బెంగాల్‌కు 78 సీట్లు పెరిగాయి. కానీ ఏపీకి మాత్రం ఒక్క సీటు మాత్రమే పెరిగింది. విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఇఎన్టీ విభాగంలో ఒక సీటు పెరిగింది. రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వైద్య కళాశాలలు, వాటి అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నప్పటికీ, ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడంతో పీజీ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోతున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎంఆర్‌ఐ పరికరం లేకపోవడం, ఒక యూనిట్‌కు ఫ్రొఫెసర్‌కు బదులు అసోసియేట్ ఫ్రొఫెసర్ ఇన్‌చార్జి వ్యవహరించడం వంటి కారణాలతో కొన్ని పీజీ సీట్లను కోల్పోయింది. శ్రీకాకుళంలోని వైద్య కళాశాల కూడా శస్తచ్రికిత్సలకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఫ్యాకల్టీ నియామకంలో శ్రద్ధ చూపకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పీజీ సీట్లు నష్టపోయే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుడంతో ఆయా కళాశాలలు సీట్లు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పీజీ సీటును అదనంగా ఏపీ దక్కించుకుంది. కానీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పీజీ కౌన్సిలింగ్‌లో ఈ సీటును ఇంకా చేర్చలేదు. దీంతో ఈ సీటు ఉందా? లేదా? అన్న సంధిగ్ధత నెలకొంది.