ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 26: ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, అందుకే కొన్ని లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన వ్యాపార వ్యవస్థాపకుల సంస్థ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన లోకేష్ మాట్లాడుతూ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి స్టార్టప్ సైబరాబాద్ అని, ఆంధ్ర రెండవదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో ఒక్క మొబైల్‌ఫోన్ కూడా తయారుకాలేదని, ఇప్పుడు దేశంలో తయారవుతున్న 10్ఫన్లలో రెండు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్నాయని పేర్కొన్నారు. మెగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఒకే చోట లక్ష మంది పనిచేసే విధంగా ఫ్యాక్టరీలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. త్వరలోనే తిరుపతిలో 150 ఏకరాల్లో రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్య ఫాక్స్‌కాన్ కంపెనీలోనే 14వేల మంది మహిళలు పనిచేస్తున్నారన్నారు. చిప్ డిజైన్ నుండి ర్యాపిడ్ డ్రోటోటైపింగ్ వరకు యువతీ యువకులకు అమరావతిలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఎలక్ట్రానిక్స్ తయారీ గురించి మాట్లాడితే చైనాలోని షేనె్జన్ గుర్తుకు వస్తుందని, అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు పనిచేస్తున్నామని న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ కంపెనీల అభివృద్దికి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. విద్యార్ధులు అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న ఉద్యోగాలు అందిపుచ్చుకునే విధంగా ఫింటెక్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. వ్యవసాయంలో 24శాతం వృద్ధి సాదించామని, రాయలసీమ తయారీ రంగానికి హబ్‌గా మారుతుందన్నారు. అమరావతి ఆధునాతన టెక్నాలజీ అభివద్ధికి వేదిక కాబోతుందన్నారు. వ్యాపార వ్యవస్థాపకుల సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ ఈవెంట్ నిర్వహించాలన్నారు. చాప్టర్ డైరెక్టర్ జయరాం కంభంపాటి, గ్రోత్ డైరెక్టర్ అభయ్‌మోహత, సిద్ధేష్‌శర్మ, పటేల్, స్మిత, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్