ఆంధ్రప్రదేశ్‌

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సురేంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్‌ఆర్టీసీ మూడో మేనేజింగ్ డైరెక్టర్, వైస్‌చైర్మన్‌గా ఎన్‌వి సురేంద్రబాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ భవన్‌లో తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎం.మాలకొండయ్యతో కలిసి దాదాపు రెండుగంటలపాటు ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ మాలకొండయ్య నుంచి గతంలో మెదక్ ఎస్పీగా చార్జి తీసుకున్నానని, తిరిగి రెండోసారి ఆయన చేతుల మీదుగా నేడు చార్జి తీసుకోటం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఏనాడూ కూడా అది చేస్తాను.. ఇది చేస్తానని చెప్పే అలవాటు లేదన్నారు. పైగా ఏ బాధ్యత చేపట్టినా దానిపై తన ముద్ర వేయించుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు.. ఉండబోదన్నారు. మరి కొద్దిరోజులపాటు సంస్థ ఆర్థిక పరిస్థితులు, కార్మికుల సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమష్టి సహకారంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర్లు, జయరావు, ఎన్‌వి రావు, చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, ఎస్‌ఎ అన్సారీ (విజయనగరం), కె.రామకృష్ణ (విజయవాడ), మహేశ్వరరావు (నెల్లూరు) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ముఖ్య ఉపాధ్యక్షుడు డి.సూర్యప్రకాశరావు తదితరులు సురేంద్రబాబును కల్సి అభినందించారు. అలాగే ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం ప్రత్యేకంగా కల్సి అభినందించింది.

చిత్రం..ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్న సురేంద్రబాబు