ఆంధ్రప్రదేశ్‌

రైల్వే శాఖ రివర్స్ గేర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ీరవాసరం, మార్చి 26: అభివృద్ధి చెందిన జపాన్, చైనా వంటి దేశాలకు దీటుగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో బుల్లెట్ ట్రైన్‌ను సైతం ప్రవేశపెట్టడానికి ఒకపక్క పరుగులు తీస్తున్న భారతీయ రైల్వే శాఖ మరోపక్క చిన్నచిన్న కారణాలతో దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఒక్కొక్కటిగా రద్దుచేస్తోంది. రాన్రానూ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన తరుణంలో ఉన్న సౌకర్యాలనే రద్దుచేస్తూ తిరోగమన దిశలో పయనిస్తోంది. విభజన అనంతరం ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటుండటం విశేషం. వివరాల్లోకి వెళితే... గత కొన్ని దశాబ్దాలుగా నడుపుతున్న నర్సాపూర్-విశాఖపట్నం సింహాద్రి లింకు ఎక్స్‌ప్రెస్ రైలును ఇటీవల రైల్వే శాఖ రద్దుచేసింది. వాస్తవానికి గుంటూరు నుండి విశాఖపట్నంకు ఉన్న ఎక్స్‌ప్రెస్ సర్వీసును ‘సింహాద్రి ఎక్స్‌ప్రెస్’గా పిలుస్తారు. ప్రతీ రోజూ ఉదయం గుంటూరులో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట మీదుగా విశాఖటపట్నం చేరుకుంటుంది. అయితే ఈ మార్గంలో లేని నరసాపురం-్భమవరం పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ నడిపేది. ప్రతి రోజూ ఉదయం నరసాపురంలో ఆరు బోగీలతో బయలుదేరే ఈ రైలు పాలకొల్లు, భీమవరం, అత్తిలి, తణుకు మీదుగా నిడదవోలు చేరుకుంటుంది. అక్కడ గుంటూరు నుండి వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ లింకు ఎక్స్‌ప్రెస్‌కున్న ఆరు బోగీలను కలుపుతారు. ఇక అక్కడినుండి యథావిథిగా విశాఖపట్నం వెళుతుంది. అలాగే ప్రతీ రోజూ ఉదయం విశాఖపట్నం నుండి గుంటూరుకు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ బయలుదే రుతుంది. మధ్యాహ్నానికి నిడదవోలు చేరుకున్న అనంతరం ఆ రైలు నుండి నరసాపురం వెళ్లాల్సిన ఆరు బోగీలను వేరుచేస్తారు. ఈ బోగీలను నరసాపురం నుండి ఆరు బోగీలను తీసుకొచ్చిన లింకు ఎక్స్‌ప్రెస్ ఇంజనుకు కలిపి, నరసాపురం పంపిస్తారు. గత కొద్ది దశాబ్దాలుగా ఇదేవిధంగా నడుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం, ఉండి, తణుకు నియోజకవర్గాలతోపాటు, తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం తదితర ప్రాంతాల ప్రజలకు విశాఖపట్నం వెళ్లడానికి ఈ ఒక్క రైలే ఆధారం. దీనితో నిత్యం ఈ రైలు కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇలాంటి రైలును ఈ నెల 20వ తేదీ నుంచి రైల్వే శాఖ రద్దుచేసింది.
సాధారణంగా ప్రయాణీకులు లేక ఆర్థికంగా నష్టాన్ని కలిగించే రూట్లలోని రైళ్లను రద్దుచేస్తుంటారు. అయితే నిత్యం ప్రయాణీకులతో కిటకిటలాడుతూ రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతున్న సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దుచేయడానికి రైల్వే శాఖ చెబుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. గుంటూరు నుండి వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు బోగీలను కలపడానికి నిర్వహించే షంటింగ్ కార్యకలాపాలకు అవసరమైనన్ని రైల్వే ట్రాక్‌లు లేకపోవడమే నర్సాపూర్-విశాఖపట్నం సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దుచేయడానికి కారణమని రైల్వే శాఖ చెబుతోంది. ఏటా బడ్జెట్‌లో వేల కోట్లు వ్యయంచేసి, కొత్తగా వేల కిలోమీటర్ల ట్రాక్‌లను నిర్మిస్తుండే రైల్వే శాఖ వేలాది మంది ప్రజలకు అందుబాటులో లాభదాయకంగా ఉన్న రైలును, కేవలం లింకు చేసే స్టేషనులో ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడంవల్ల రద్దుచేశామని ప్రకటించడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్‌లో కీలకమైన జంక్షన్లలో ఒకటైన నిడదవోలు రైల్వే స్టేషన్‌లో షంటింగ్ వంటి కార్యకలాపాల నిర్వహణకు మరికొన్ని ట్రాక్‌లు ఏర్పాటుచేసుకోవడం రైల్వేశాఖకు పెద్ద పనికాదు. కొత్త ట్రాక్‌ల నిర్మాణానికి ఈ స్టేషన్‌లో రైల్వే శాఖకు కావలసినంత భూమి కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం షంటింగ్ జరపడం కష్టసాధ్యమవుతోందనే కారణంతో దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న రైలును రద్దుచేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ రైలును పునరుద్ధరించాలని ఇప్పటికే వివిధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కాగా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి, సింహాద్రి లింకు ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల రిజర్వేషన్ సదుపాయాన్ని సైతం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రద్దుచేయడానికి రైల్వే శాఖ ఉన్నతాధికార్లు కసరత్తు జరుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం, ఉండి, అత్తిలి, కృష్ణా జిల్లాలోని మండవల్లి స్టేషన్లలో ఉన్న రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించనున్నట్టు సమాచారం. అయితే దీనికి కూడా రైల్వే అధికారులు చెబుతున్న కారణం హాస్యాస్పదంగానే ఉంది. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కొన్ని కొత్త రైళ్ల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరగడమే రిజర్వేషన్ సౌకర్యం రద్దుకు కారణం. రైళ్ల రాకపోకలు పెరగడంవల్ల ఈ స్టేషన్ల మాస్టర్లు రిజర్వేషన్ వ్యవహారాల్లో తలమునకలవుతుండటం, అదే సమయంలో రైళ్ల రాకపోకలు సాగుతుండటంవల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని రైల్వే ఉన్నతాధికార్లు చెబుతున్నట్టు సమాచారం. ఇది కొంతమేరకు వాస్తవమే అయినప్పటికీ, రిజర్వేషన్ల వ్యవహారాలు పర్యవేక్షించడానికి ప్రతీ స్టేషనులో అదనంగా క్లర్కును ఏర్పాటుచేస్తే సరిపోతుంది. అయితే అందుకు భిన్నంగా ఉన్న సదుపాయాలకు కత్తెర వేస్తున్నారు.
వాస్తవానికి రైళ్ల ట్రాఫిక్ పెరిగితే ప్రయాణీకుల అవసరాలు పెరుగుతాయి. ఆమేరకు సాధారణ రిజర్వేషన్‌తోపాటు తత్కాల్ వంటి సౌకర్యాలు కల్పించాల్సివుంది. అయితే ఇప్పటికే తత్కాల్ సౌకర్యం రద్దుచేసిన రైల్వే అధికారులు తాజాగా ఉన్న సాధారణ రిజర్వేషన్ సౌకర్యం కూడా రద్దుచేయడానికి రంగం సిద్ధంచేశారు.