ఆంధ్రప్రదేశ్‌

గుజరాత్‌పైనే ‘దేశం’ గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ బీజేపీపై మరిన్ని అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ సహా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎండగడుతున్న నేపథ్యంలో.. నరేద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం ద్వారా, రాజకీయంగా బీజేపీని, నైతికంగా మోదీని దెబ్బతీసేందుకు టీడీపీ ఇప్పటికే కార్యాచరణ అమలుచేస్తోంది. తాము రాష్ట్రానికి వేల కోట్లు ఇస్తున్నా, బాబు సర్కారు వాటికి లెక్కలు చెప్పడం లేదని, ప్రభుత్వ లోపాలను కాగ్ కూడా తప్పుపట్టిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నిజమని నమ్మే అవకాశం ఉందని గ్రహించిన టీడీపీ నాయకత్వం.. ఆ మేరకు ఇప్పటివరకూ తాము కేంద్రానికి పంపిన లెక్కల వివరాలతోపాటు, మోదీ సీఎంగా ఉన్నప్పుడు కాగ్ ఎత్తిచూపిన తప్పులు, యుటిలిటీ సర్ట్ఫికెట్లు (యూసీ) నాటి యుపీఏ సర్కారుకు ఇవ్వని వైనాన్ని విస్తృతంగా చర్చించడం ద్వారా, నిజాయితీ నేతగా మోదీపై ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నాలకు టీడీపీ తెరలేపింది. దానితోపాటు, దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు, మోదీ తన సొంత గుజరాత్ రాష్ట్రానికి చేస్తున్న మేలును కూడా బయటపెట్టడం ద్వారా, బీజేపీని పూర్తి స్థాయిలో ప్రజలు ముందు గుజరాత్ పక్షపాతిగా నిలబెట్టనుంది. మోదీ తన గుజరాత్ రాష్ట్రానికి అన్నీ తరలించుకుపోవడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా.. ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు పార్టీ పక్షమా? ప్రజల పక్షమా అని నిలదీసి వారిని ఇరుకున పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. స్వయంగా బాబు కూడా గత మూడు రోజుల నుంచి నేరుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి అవినీతితోపాటు, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి వ్యవహారాలను ప్రశ్నించడం ద్వారా రాజకీయ వేడి పెంచారు. ముఖ్యంగా గుజరాత్‌లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన గుజరాత్ స్టేట్ ఆయిల్ కంపెనీకి 23వేల కోట్ల నష్టాలు వస్తే దానిని మోదీ ప్రధాని అయిన తర్వాత, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో విలీనం చేసిన వైనాన్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించింది. అదే సమయంలో విభజన చట్టంలో కాకినాడలో ఆయిల్ రిఫైనరీ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఉన్నప్పటికీ, దానిని ఇవ్వకుండా వయబిలిటీ గ్యాప్ కోసం 15 వేల కోట్లు చెల్లించాలన్న కేంద్ర వైఖరిని జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా, గుజరాత్ పక్షపాతాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. గత పదేళ్ల కాలంలో గుజరాత్‌లో అధికారంలోఉన్న బీజేపీ సర్కారు వివిధ పథకాలకు సంబంధించిన 9120 కోట్ల ఖర్చులకు ఇవ్వాల్సిన 16, 586 యూసీలు ఇవ్వని వైనాన్ని ప్రశ్నించని రాష్ట్ర బీజేపీ నేతలు, సొంత రాష్ట్రం యూసీలు చెల్లించడం లేదంటూ విమర్శిస్తూ కేంద్రానికి వత్తాసు పలుకుతున్న వైనాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పట్టిసీమ, ఇతర అంశాల్లో టీడీపీ ప్రభుత్వాన్ని కాగ్ తప్పుపట్టిన వైనాన్ని పదే పదే ప్రస్తావిస్తోన్న బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు మోదీ సీఎంగా ఉన్నప్పటి కాలంతోపాటు, ఇప్పటి హయాంలో ఇచ్చిన కాగ్ నివేదికలను బయటపెట్టాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కాగ్ నివేదికలను పట్టించుకోవలసిన అవసరం లేదన్న వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తీసుకురావడం ద్వారా, మోదీ ద్వంద్వ విధానాలను ఎండగట్టనుంది. గుజరాత్‌లో కూడా 25వేల కోట్ల అవినీతితోపాటు, జైలు సెక్యూరిటీ విషయంలోనూ చేసిన ఖర్చులో అవినీతి జరిగిందన్న అదే కాగ్ నివేదికలపై బీజేపీని నిలదీయనుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పన్నులు తీసుకుంటున్న కేంద్రం ఆ నిధులను ఏం చేస్తోందన్న ప్రశ్నలతో బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ప్రధానంగా వివిధ సెస్‌ల ద్వారా కేంద్రం వసూలు చేస్తున్న నిధులను ఎంతవరకూ ఖర్చు చేస్తున్నారన్న ఎదురుదాడికి దిగడం ద్వారా.. అదే ప్రశ్నలు తమపై సంధిస్తోన్న రాష్ట్ర బీజేపీ నేతలకు చెక్ పెట్టనుంది. వీటికి మించి.. అన్ని రాష్ట్రాల డబ్బులతోనే మోదీ గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ కడుతున్నారన్న అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. ఆ పార్టీని జనం ముందు దోషిగా నిలబెట్టలన్న వ్యూహంతో వెళ్లనుంది. జన సామాన్యానికి అర్థమయ్యేలా ఒక రూపాయి కేంద్రానికి పంపిస్తే, మళ్లీ కేంద్రం మనకు ఎంత ఇస్తోందన్న విషయాన్ని లెక్కలతో వివరించేందుకు సిద్ధమవుతోంది