ఆంధ్రప్రదేశ్‌

హోదాపై రాజీనామా డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపాపై అధికార పార్టీ మంత్రులు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేత జగన్‌కు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని సోమవారం ఇక్కడ విమర్శించారు. ప్రతిపక్షం రాష్ట్ర శాసనసభలో ప్రశ్నించకుండా రోడ్డు వెంట తిరుగుతూ అవాకులు, చెవాకులు పేలుతోందన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడానికి అనేక పార్టీలు ముందుకు వచ్చాయని, కానీ కేంద్రం అవిశ్వాసంపై చర్చించడానికి ముందుకు రాకుండా వాయిదాల పర్వంతో సభను నడిపిస్తోందన్నారు. తాజాగా ఎంపీల రాజీనామాలు అంటూ కొత్త నాటకానికి జగన్ తెరలేపారని, ఈ రాజీనామాలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభాకరరెడ్డిలతో కలిపి ఉంటాయా? సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన రెండు, మూడు బడ్జెట్‌ల్లో కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదని, దానిపై ఆనాడే ముఖ్యమంత్రి విమర్శించారన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి సరైన న్యాయం జరగకపోవడంతో బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో బయట కూడా పోరాడుతున్నామన్నారు. బస్సులో నుంచే ముఖ్యమంత్రి విజయవాడలో పరిపాలన ప్రారంభించారని గుర్తు చేశారు. అమరావతి రాజధానిలో పెద్దఎత్తున రోడ్లు, భవనాలు నిర్మిస్తుంటే అమరావతి రాజధాని ఎక్కడా అని అవహేళన చేయడం సిగ్గుచేట్టన్నారు. బీజేపీ నేత అమిత్‌షా రాసిన లేఖకు ముఖ్యమంత్రి రెండున్నర గంటల పాటు ప్రతి అంశాన్ని శాసనసభలో వివరిస్తే అర్థం కావడం లేదని అవహేళన చేస్తున్నారన్నారు.

కేసుల మాఫీకే వైసీపీ రాజీనామా డ్రామాలు
గుంటూరు: ప్రత్యేక హోదా పేరుతో ఎంపీల రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడితే రాజీనామాలు చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదికాలం గడువు ఉందని, ఎంపీలంతా రాజీనామాచేస్తే రాష్ట్రం నుంచి అడిగేవారు లేకుండా చేయాలనే బీజేపీ, వైసీపీ ఎత్తుగడలో భాగంగానే హైడ్రామా నడుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ ఉచ్చులో టీడీపీ ఎంపీలు పడబోరని స్పష్టం చేశారు. పార్లమెంటులో నిరంతరం హోదా, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తారని తెలిపారు. ప్రస్తుత సమావేశాలు వాయిదా పడినా మరోసారి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని, ఆ సమావేశాల్లో నిరంతరం కేంద్రాన్ని టీడీపీ నిలదీస్తుందన్నారు. చిత్తశుద్ది ఉంటే విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

ధైర్యముంటే అవిశ్వాసం ఎదుర్కోవాలి!
శ్రీకాకుళం: ధైర్యముంటే బీజేపీ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు సవాల్ విసిరారు. విభజన పేరుతో ఏపీని నిండా ముంచేసి, ఇప్పుడు నేరం తమది కాదంటే తమది కాదంటూ మరొకరిపై తోసేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి జైట్లీ వాఖ్యలు తమను ఆవహేళన చేసేలా ఉన్నాయన్నారు. ఏపీని చూసి కేంద్రం భయపడుతోందని, అందుకే అవిశ్వాసంపై బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకంగా ఏమీ చేయలేదని కేంద్రప్రభుత్వం అంగీకరించాల్సిందే అన్నారు. విజయ్‌మాల్య, విజయసాయిరెడ్డి లాంటి ఆర్థికనేరగాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోరని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలుగువారి ఐక్యతను దెబ్బతీసేందుకు ఏపీలో కొన్ని రాజకీయపార్టీలు ప్రయత్నించడం బాధాకరమన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న వారి వెనుక బీజేపీ ఉందని విమర్శించారు. ప్రత్యేకహోదాపై పోరాడేందుకు ఏపీలో ఐక్యత లేకపోవడం దురదృష్టకరమని, వైసీపీకి కావల్సింది ముఖ్యమంత్రి పదవి మాత్రమేనన్నారు. వైసీపీకి దమ్ముంటే విభజన హామీల్లో ఉన్న 19 అంశాలపై బీజేపీని నిలదీయాలని కోరారు. రాజీనామాలతోనే రాష్ట్ర ప్రయోజనాలు చేకూరతాయంటే తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే కేంద్రం నుంచి టీడీపీ బయటికి వచ్చిందన్న బీజేపీ కేంద్ర కమిటీ చీఫ్ అమిత్‌షాపై ఆయన ఫైర్ అయ్యారు. నాలుగేళ్ళుగా మిత్రధర్మం పాటించింది టీడీపీ ఒక్కటేనని, అసలు మిత్రపక్షం అంటే ఏమిటో బీజేపీకి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఏపీకి చాలా నిధులు ఇచ్చామంటూ లేఖ రాసిన అమిత్‌షాకు ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోవడం వెనుక ఏ రాజకీయ కారణం ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు.