ఆంధ్రప్రదేశ్‌

గ్లోబల్ సింగిల్ విండోతో పరిశ్రమలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 27: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు గ్లోబల్ సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. దీనివల్ల 21 రకాల అనుమతులు ఏకకాలంలో మంజూరవుతాయన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి కల్పనకు మార్గం సుగమం అవుతోందని, కార్మికుల భద్రతకు కూడా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు కూడా బీమా సదుపాయాన్ని వర్తింప చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం ఆసరాగా ఉంటోందని పితాని వివరించారు.