రాష్ట్రీయం

పునరావాసంపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పునరావాసాన్ని పరుగులు పెట్టించాల్సిన తరుణం ఎదురైంది. పదేళ్ల కాలంలో కేవలం పధ్నాలుగు గ్రామాలకే పరిమితమైన పునరావాసాన్ని సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. పోలవరం గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి అందించాల్సి వుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని నిర్వాసితులకు మాత్రం భూమికి భూమి పంపిణీ పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చేందుకు స్థానికంగా ప్రాజెక్టు పరిధిలో భూమి లభ్యం కాకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో భూమికి భూమి సంబంధించి ఇంకా 17,793 ఎకరాలు సేకరించాల్సి వుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7829 ఎకరాలు భూమికి భూమి ఇవ్వాల్సి వుండగా సేకరించి ఈ మొత్తం భూమిని నిర్వాసితులకు పంపిణీ చేశారు. ప్రాజెక్టు ముంపులో నిర్వాసితులు కోల్పోయే భూమి ఎంత ఉన్నప్పటికీ అందులో రెండున్నర ఎకరాల వరకు భూమికి భూమిగా ఇచ్చి మిగిలిన భూమికి పరిహారాన్ని చెల్లిస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం భూమికి భూమి నిమత్తం 19,426 ఎకరాలు సేకరించాల్సి వుండగా ఇప్పటి వరకు 1633 ఎకరాలు సేకరించారు. ఇంకా 17,793 ఎకరాలు సేకరించాల్సి వుంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలాల్లో ప్రధానంగా పోలవరం హెడ్‌వర్క్సు నిర్మాణానికి సంబంధించి ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో మొత్తం 42 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సివుంది. మొదటి దఫాలో ఏడు గ్రామాలను
తరలించాల్సి వుంది. అయితే ఇప్పటికి అధికారుల లెక్కల ప్రకారం ఏడు గ్రామాలను తరలించినట్టు చూపుతున్నప్పటికీ, ఇంకా ఒకటి రెండు గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సివుంది. మొదటి దఫాలో 1231 మంది నిర్వాసితులను తరలించాల్సివుంది. అధికారుల లెక్కల ప్రకారం ఇంకా 916 మంది నిర్వాసితులను తరలించాల్సివుంది. నిర్వాసితులకు పునరావాసం నిమిత్తం అఖండ గోదావరి నది ఎడమ గట్టువైపు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో పునరావాసం కల్పించాల్సివుంది.
అఖండ గోదావరి నది కుడి గట్టువైపు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 137 ఆవాసిత ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. హెడ్ వర్క్సు ప్రాంతంలో మాత్రం ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేలేరుపాడు, కుకునూరు, పోలవరం మండలాలు ముంపు మండలాలుగా ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో 41.15 మీటర్ల కాంటూరులో ఆవాసిత ప్రాంతాలు నిర్వాసితులవుతున్నాయి. 12,449 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సివుంది. ఇందులో ఎస్టీలు 5,045 మంది, గిరిజనేతరులు 7,404 మందిని గుర్తించారు. ముందుగా ఎనిమిది గ్రామాలకు పునరావాసం కల్పించారు. ఇప్పటి వరకు 2584 మందికి పునరావాస ప్యాకేజీ అందించారు. ఇంకా ఈ జిల్లాలో 9865 మందికి పునరావాసం కల్పించాల్సివుంది.
పునరావాస కాలనీలకు సంబంధించి ఇంకా రూ.86 కోట్లు ఖర్చు చేయాల్సివుంది. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు కుటుంబానికి ఏకమొత్తంగా రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఏడాది పాటు జీవన భృతిగా నిర్వాసితులకు రూ.36 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే అదనంగా మరో రూ.50 వేలు, ఒక్కో కుటుంబానికి ట్రాన్స్‌పోర్టు ఖర్చుగా రూ.50 వేలు ఇస్తున్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి రూ.25 వేల చొప్పున, పశువుల పాక, చిన్న చిన్న బడ్డీకొట్లు కోల్పోయిన నిర్వాసితులకు మరో రూ.25వేలు చొప్పున. ఒకేసారి సెటిల్‌మెంట్ అలవెన్స్‌గా ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున వెరశి ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షల నుంచి రూ.7.36 లక్షల వరకు పునరావాస ప్యాకేజీ అందజేస్తున్నారు. మొత్తం మీద పదేళ్ల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో హెడ్ వర్క్సులో ముంపునకు గురయ్యే మొదటి దఫా సుమారు 14 గ్రామాలకు పునరావాసం కల్పించేందుకే ఇంతకాలం పట్టింది. ఇక మిగిలిన గ్రామాలకు పునరావాసం ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీరిస్తామంటున్న 2019లోగా పూర్తిచేయాల్సివుంది. పునరావాసం తర్వాతే ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలనే డిమాండు పలు సంఘాల నుండి వ్యక్తమవుతోంది.