ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీలో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీలో జాప్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. మన్యంలోని గర్భిణులు, బాలింతలు, బాలికల ఆరోగ్య రక్షణకు గిరిజన మండలాలను దత్తత తీసుకోవాలని, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలను చైతన్యపర్చాలని, వారితోపాటు జిల్లాస్థాయి అధికారులు కూడా ముందుకు రావాలన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలో మాతా శిశు వైద్య పథకాలు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కింద అమలుచేస్తున్న ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, బాలికల్లో రక్తహీనత, బీపీ తదితర ఆరోగ్య స్థితిగతులపైనా, పౌష్టికాహారం పంపిణీపైనా, ఐదేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు కొలతలపైనా తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో గర్భిణుల నమోదు ప్రక్రియ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు నమోదు చేస్తారన్నారు.
గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 15 గిరిజన మండలాల్లో ఉన్న బాలింతలు, గర్భిణులు, శిశువులతో పాటు బాలబాలికల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా వారికి అందేలా చూడాలన్నారు. గిరిజన గ్రామాలను దత్తత తీసుకునేలా స్వచ్ఛంద సంస్థలను, దాతలను చైతన్యపర్చాలన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు అందజేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 15,36,719 ఉద్యోగుల హెల్త్ కార్డులు అందజేశామని, మరో 2,01,069 మందికి త్వరలో అందజేస్తామని అధికారులు తెలిపారు.