ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’ పనుల లక్ష్యం గ్రామానికి రూ.20 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం పనులు కనీసం ఒక్కో గ్రామంలో 20 లక్షల రూపాయల మేర జరగాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ల వర్క్‌షాపులో మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఈ పథకాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరింతగా కష్టపడి ఈ ఏడాది 10 వేల కోట్ల రూపాయల మేర ఉపాధి పనులు చేపట్టాలన్నారు. గత పాలకుల హయాంలో మెటీరియల్ కాంపొనెంట్ రూపంలో వచ్చిన 3500 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. గత సంవత్సరం ప్రారంభించి 6 వేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. వేసవిలో వేతనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఖాళీగా ఉన్న 791 ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు.

చిత్రం.. సమీక్షలో మంత్రి లోకేష్