ఆంధ్రప్రదేశ్‌

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాకేష్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా చిత్తూరుకు చెందిన పోచరెడ్డి రాకేష్‌రెడ్డి 2,652 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అఖిల భారత యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో పీఆర్వో టికె రామ్ ఆధ్వర్యంలో ఏపీ యూత్ కాంగ్రెస్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మంది ఎన్నికలకు పోటీ చేయగా, అధ్యక్షులుగా పి.రాకేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా రామారావు, ఎబీఎన్ వర్మ, సుభాన్‌వల్లీ, అట్లూరి విజయకుమార్‌లు ఎన్నికైనట్లు టికె రామ్ తెలిపారు. అనంతరం పీసీసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికలే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పనితనం ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన పాపం మొత్తం కాంగ్రెస్‌పైనే వేశారని, కానీ అన్ని రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చాకే కాంగ్రెస్ పార్టీ విభజనకు ముందుకు వచ్చిందన్నారు. 2019లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు.

చిత్రం..విజయోత్సవ ర్యాలీ