ఆంధ్రప్రదేశ్‌

పాలన కొలువైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 29: గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన సచివాలయ భవనంలో ఒక బ్లాకును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఐదవ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని తమ ఛాంబర్లను ప్రారంభించారు. లేబర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ విభాగాన్ని ముఖ్య కార్యదర్శి జి అనంతరామ్ ప్రారంభించారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రారంభించారు. మధ్యాహ్నం 2.50 గంటలకు మంత్రి అయ్యన్నపాత్రుడు ఐదవ బ్లాక్ ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేశారు. వేద మంత్రోచ్చారణలు, పూర్ణకుంభ స్వాగతంతో మంత్రి అయ్యన్నపాత్రుడును ఆయన ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కూడా పాల్గొన్నారు. తరువాత గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని తన ఛాంబర్‌కు చేరుకున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తరువాత మంత్రులు తమ ఛాంబర్లలోని రిజిస్టర్లలో సంతకాలు చేశారు.
నాలుగు బస్సుల్లో తరలివచ్చిన ఉద్యోగులు
తాత్కాలిక సచివాలయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సెక్రటేరియట్ ఉద్యోగులు నాలుగు బస్సుల్లో తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు విజయవాడ- గుంటూరు మధ్య కనకదుర్గమ్మ వారధిపై స్థానిక ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్న తరువాత కూడా స్థానికులు వారికి స్వాగతం పలికి, ఛాంబర్లలోకి తీసుకెళ్లారు.
తరలివచ్చిన స్థానికులు
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెలగపూడి, చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. రాజధాని అమరావతిలో జరిగిన తొలి నిర్మాణం తాత్కాలిక సచివాలయం. ఇక్కడి నుంచే రాష్ట్ర పాలన ప్రారంభమయ్యేందుకు జరుగుతున్న వేడుకను తిలకించేందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయంలో తొలిగా తన ఛాంబర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తమకుంటూ సొంత కార్యాలయం ఇప్పటివరకూ లేదని, ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 వేల పంచాయతీల పనులు ఇక్కడి నుంచే జరుగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో పనిచేసిన ఉద్యోగులు తమ బాధ్యతను గుర్తెరిగి ఇక్కడ పనిచేయడానికి రావడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి మృణాళిని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో సచివాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు.
ఆగస్ట్ 15నాటికి పూర్తిస్థాయి పాలన:టక్కర్
గత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిరేటు సాధించామని, ఈ ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ చెప్పారు. దీనికి ఉద్యోగులు ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. మన ఉద్యోగులు తెలంగాణలో ఉంటూ ఏడాదికి రూ. 5వేల కోట్లు అక్కడ ఖర్చు చేస్తున్నారని, వారంతా మన రాష్ట్రానికి వచ్చేస్తే ఆ మొత్తం ఇక్కడ ఖర్చవడం ద్వారా అనేక లాభాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని, తొలిదశలో 15 వేల మంది వస్తారని తెలిపారు. ఇందులో 5 వేల మంది సెక్రటేరియట్, 10 వేల మంది హెచ్‌ఓడి ఉద్యోగులు ఉంటారన్నారు. 50, 60 రోజుల్లో తాత్కాలిక సచివాలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. ఆగస్ట్ 15 నాటికి పూర్తిస్థాయిలో సచివాలయం నుంచి పాలన సాగిస్తామని టక్కర్ వివరించారు.

చిత్రం... తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా సందడి