ఆంధ్రప్రదేశ్‌

సత్తాచాటిన శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పీఎస్‌ఎల్‌వీల రాకెట్ల విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం తెల్లవారు జామున 4గంటల 4నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ద్వారా ఇస్రో చేపట్టిన ఇండియన్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాన్ని శాస్తవ్రేత్తలు అనుకొన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం షార్‌లో సిగలో మరో కలిగి తురాయిగా నిలిచింది. దీంతో ఇస్రో ప్రతిష్ట కూడా ఇనుమడించి ఆగ్ర దేశాల సరసన భారత్ నిలిచింది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 42 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు జరిగాయి. ఇది 43వ ప్రయోగం కావడంతో పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహ ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. రెండు ప్రయోగాలు మినిహా మిగిలినవన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టిన బుడిబుడి అడుగులు వేసుకొంటున్న శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరారు. గతంతో ఇదే తరహాలో చంద్రయాన్-1 ద్వారా ఒకేసారి పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత కూడా ఇస్రోదే. అరుణగ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపి శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. మళ్లీ అగ్ర దేశాలకు దీటుగా నేవిగేషన్ సేవలకు శ్రీకారం చుట్టి సొంత మార్గదర్శి దిక్సూచి వ్యవస్థకు రూపకల్పనలో మన శాస్తవ్రేత్తలు విజయం సాధించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో షార్ కేంద్రం నుంచి గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సి 41 రాకెట్ ద్వారా నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం నిర్ధేశించిన సమయానికే ఉపగ్రహాన్ని 19:19నిమిషాల్లో 284కి.మీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో శాస్తవ్రేత్తలతోపాటు ఉద్యోగులందరూ సంబరాలు చేసుకొన్నారు. షార్‌తో పాటు పక్కనే సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగ విజయంతో ఇదే ఉత్సాహంతో నేవిగేషన్ వ్యవస్థ సొంతంగా దేశానికి సమకూర్చుకొనే అవకాశం దక్కింది.
ఉపగ్రహ ప్రయోగాలకు నిధుల కొరత లేదు
అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) చేపట్టే ఉపగ్రహాల ప్రయోగాలకు నిధుల కొరత లేదని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కె.శివన్, షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ అన్నారు. పీ ఎస్ ఎల్‌వీ విజయానంతరం ఆయన షార్‌లోని మీడియా సెంటర్‌లో విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మార్చి 29న ప్రయోగించిన జీశాట్-6 ఏ ఉపగ్రహం సంబంధాలు ఎందుకు తెగిపోయాయని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ జీశాట్-6ఏ ఏ కక్ష్యలో ఉందో కనుగొన్నామన్నారు. జీశాట్-6ఏ పనిచేసేందుకు శాస్తవ్రేత్తలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్, రోవర్, అర్బిటార్‌లను పంపనున్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయన్నారు. ఇస్రో తొలిసారిగా 5.7టన్నుల భారీ సామర్ధ్యం గల జీశాట్-11ను త్వరలోను ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.