ఆంధ్రప్రదేశ్‌

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ఈ విషయాన్ని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. తనకు అలాంటి ఆకాంక్షలు లేవని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో శుక్రవారం జరిగిన హెచ్‌టీ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో సభికులు అడిగిన ఓ ప్రశ్నపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో ఒక నమూనాగా తీర్చిదిద్దటమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో సంక్లిష్ట పరిస్థితిని, సంక్షోభాన్ని ఎదుర్కొన్నామన్నారు. రూ. 16వేల కోట్ల రెవెన్యూ లోటుతో నవ్యాంధ్ర ప్రయాణం ప్రారంభమైందని, కనీసం వౌలిక సదుపాయాలు లేని పరిస్థితి నాడు ఉండేదని తెలిపారు. అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విద్యా, పరిశోధనా సంస్థలు లేవని, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తెలుగువారందరి రాజధానిగా భావించి అభివృద్ధి చేశామన్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగాక తమకెన్నో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. కానీ తమకో విజన్ ఉందని, తమ రాష్ట్రాన్ని 2022కల్లా దేశంలో మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న విజన్‌ను నిర్దేశించుకుని పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
2019 జూన్ నాటికి పోలవరం
విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, నీతి ఆయోగ్ సిఫారసులతో త్వరగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53శాతం పూర్తయిందని, జూన్ 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామన్నారు. సముద్రంలో వృథాగా కలిసే వరద నీటిని సాగు, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు మళ్లించేందుకు దేశంలోనే మొదటిసారిగా నదుల్ని అనుసంధానం చేశామని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందా? అనే ప్రశ్నకు.. ఈ అంశంపై చర్చించడానికి ఇది సరైన వేదిక కాదని బదులిచ్చారు. దీనిపై భారత్‌లో కూర్చుని మాట్లాడుకుందామన్నారు. ఒక విషయం స్ప ష్టం చేయదలిచానని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదని, ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుందని బాబు వ్యాఖ్యానించారు.