ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి రూ. 1600 కోట్ల ఉపాధి హామీ నిధుల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో వేతన చెల్లింపుల కోసం రూ. 1602.27 కోట్ల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు పి రంజిత్ బాషా శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఇందులో గత ఏడాదికి సంబంధించిన వేతన బకాయిల మొత్తాలు కూడా కలిసి ఉన్నాయన్నారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ. 522.42 కోట్లు వేతనాల కోసం కేంద్రం విడుదల చేసిందని, దీంతో ఈ నెల 7 వరకు ఉన్న బకాయిలకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరిగిపోతాయని ఆయన చెప్పారు. మిగిలిన రూ. 1,079.85 కోట్ల నిధులు రాష్ట్రానికి అందుబాటులో ఉంటాయని, రాబోయే రెండు మూడు నెలల్లో ఈ నిధులను వేతన చెల్లింపులకు వెచ్చిస్తామన్నారు. ఉపాధి హామీ వేతనదారులంతా ఎలాంటి అపోహలు లేకుండా పూర్తిస్థాయిలో ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని రంజిత్ బాషా కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 7,243 కోట్లు బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రూ. 8,200 కోట్ల వరకు పథకంలో ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు.