ఆంధ్రప్రదేశ్‌

మామిడి రైతులకు మేలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని మామిడి పండించే రైతులకు అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభదాయకమైన ధరలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉద్యానవన, మల్బరీ శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. నగరంలో శుక్రవారం తొలిసారిగా రాష్టస్థ్రాయి మామిడి కొనుగోలు, విక్రయదారుల సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మామిడి పండించే రైతులు, కొనుగోలుదారులు పరస్పరం చర్చించుకోవడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం రాష్టస్థ్రాయి సదస్సులు నిర్వహించి ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతుందన్నారు. మామిడి రైతులు తమ పంటలకు నాణ్యమైన యాజమాన్య పద్ధతులు అవలంభించి విదేశాలకు ఎగుమతి అయ్యేలా కృషి చేయాలన్నారు. సాధారణంగా మామిడి కాపుకు వచ్చి కోత కోసి కొంతకాలం నిల్వ ఉంచేలా రైతుల్లో అవగాహన ఉండాలన్నారు. మామిడి ఎగుమతులు సముద్ర, ఆకాశ మార్గాన చేయవలసి ఉన్నందున వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండాలన్నారు. మామిడి పండించే రైతు సంఘాలకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి ఉద్యానవన సిబ్బంది సేవలను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి, అధిక లాభాలు ఆర్జించేలా రాష్ట్రంలోని మామిడి పండించే రైతులు ముందుకు రావాలని కమిషనర్ చిరంజీవి చౌదరి సూచించారు. ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి హనుమంతరావు, ఏడీ సుజాత, రాష్ట్రంలోని వివిధ జిల్లాల మామిడి రైతులు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మామిడి దిగుమతిదారులు పాల్గొన్నారు.