ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ ఫస్టియర్‌లోనూ బాలికలదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ(జగదాంబ), ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో విడుదల చేశారు. ద్వితీయ, ప్రథమ సంవత్సరం ఫలితాలలో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ప్రథమ సవంత్సరంలో 62శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తొలి సంవత్సరంలో 64 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ఫస్ట్ ప్లేస్ సాధించగా, కడప చివరి స్థానంలో నిలిచింది. రాష్టవ్య్రాప్తంగా 1,423 పరీక్షా కేంద్రాలలో 4,78,621 మంది విద్యార్థులు హాజరుకాగా 2,95,891 మంది పాసయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత లభించింది. దీనిలో పరీక్షకు హాజరైన బాలికలు 2,36,918 మందికిగాను 1,57.552 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురులో 2,41,703 మంది విద్యార్థులకు గాను 1,38,339 మంది పాసయ్యారు. 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో బాలికలు 15,215 మంది హాజరుకాగా 9,215 మంది పాసై 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురలలో 16,073 మంది విద్యార్థులకు 7,114 మంది విద్యార్థులు పాసై 44శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇంటర్‌లో బాలికల కంటే బాలురు పది శాతం తక్కువుగా ఉత్తీర్ణత సాధించారు. తొలి సంవత్సరం ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కృష్ణా 75 శాతం, పశ్చిమగోదావరి 67 శాతం, గుంటూరు 65 శాతం సాధించగా, అత్యల్పంగా కడప 48శాతం, శ్రీకాకుళం 53శాతం, అనంతపురం 54 శాతం సాధించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధికంగా విజయనగరం 64శాతం, శ్రీకాకుళం 52 శాతం, పశ్చిమగోదావరి 48 శాతం ఉత్తీర్ణతను సాధించగా, అత్యల్పంగా విశాఖపట్నం 30 శాతం, అనంతపురం 33 శాతం, కడప 38 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఎయిడెడ్ కళాశాలకు సంబంధించి అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని చిత్తురు 58 శాతం, కృష్ణా, పశ్చిమగోదావరి 54 శాతం, విశాఖపట్నం 38శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అత్యల్పంగా విజయనగరం 24 శాతం,కర్నూల్,నెల్లురూ 30 శాతం, తూర్పుగోదావరి 32 శాతం ఉత్తీర్ణతను సాధించాయి.
జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు
కృష్ణా 62,067 46517 75
పశ్చిమగోదావరి 33005 22135 67
గుంటూరు 49,243 31,887 65
నెల్లూరు 28,532 31,887 65
చిత్తురు 44,159 28,184 64
విశాఖ 49,319 31,029 63
విజయనగరం 22,504 13,272 59
తుర్పుగోదావరి 46,068 27,129 59
కర్నూల్ 35,395 20,103 57
ప్రకాశం 26,678 15,095 57
అనంతపురం 31,748 17,002 54
శ్రీకాకుళం 28,280 15,030 53
కడప 21,623 10,296 48
మొత్తం 62 శాతం ఉత్తీర్ణత సాధించగా, పదికి పది 24,163 మంది విద్యార్థులు సాధించగా, 10-9ల మధ్య పాయింట్ల వచ్చిన విద్యార్థులు 77,648, 9-8 పాయింట్ల మధ్య 60,297,8-7 పాయింట్ల మధ్య 55,396, 7-6 పాయింట్ల మధ్య 46,046, 6-5 పాయింట్ల మధ్య 26,428, 5-4 పాయింట్ల మధ్య 5,895, నాలుగు కంటే తక్కువుగా 18 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ఓకేషనల్ విద్యార్థులలో 52 శాతం ఉత్తీర్ణత సాధించగా, వీరిలో పదికి పది పాయింట్లు సాధించిన వారు నలుగురు, 10-9 పాయింట్ల మధ్య 2,812,9-8 మధ్య 5,846, 8-7 మధ్య 5,717,7-6 పాయింట్ల మధ్య 1,756, 6-5 పాయింట్ల మధ్య 190, 5-4 మధ్య నలుగురు ఉత్తీర్ణీలైయ్యారు.
మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ప్రథమ,ద్వితీయ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని వారికి మే 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లెమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వీటికి సంబంధించి విద్యార్థులు పరీక్షా ఫీజును చెల్లించడానికి ఈ నెల 21 వరకూ గడవుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలో గతం కంటే గణనీయంగా తగ్గిందని దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.