ఆంధ్రప్రదేశ్‌

ఎంతకాలం వంచిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 15: ప్రజలను నిరంతరం మోసం చేస్తూ, అబద్ధాలతో ఎంతకాలం వంచిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. చంద్రబాబు ఆడే అబద్ధాలు, మోసాలు క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమైనవన్నారు. మోసాలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో కాపులు సహా అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో స్వగృహంలో చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ ప్రతులను ఆదివారం విలేఖరులకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ కాపులకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామంటూ పదే పదే మోసం చేస్తూవచ్చారన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు కేంద్రానికి పంపిన బిల్లును పరిశీలిస్తే మరో నాలుగు దశాబ్దాలైనా అది అమలుకు నోచుకోదని వ్యాఖ్యానించారు. దళితుల భూములను ఏదో ఓ వంకతో కబ్జాలు చేయించడం, అడ్డుపడితే కొట్టించడం, రైతుల జీవితాలను చీకటి చేసి వలస కూలీలుగా మార్చివేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కాపులు సహా అణగారిన వర్గాలు, ఇతర కులాలకు చెందిన వారందరూ అధోగతి పాలవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అణగారిన వర్గాలతో కలసి చంద్రబాబుపై జనపోరాటం చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా స్టువర్టుపురం గ్రామానికి చెందిన రాగాల వెంకట రాహుల్ కామనె్వల్త్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు గెలిస్తే కనీసం అభినందనలు చెప్పలేదని, అదే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓ క్రీడాకారిణి రజిత పతకాన్ని సాధిస్తే బ్రహ్మరథం పట్టడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. తన సామాజికవర్గానికి చెందిన వారికి లాటరైట్, ఇసుక, మట్టి సహా అన్ని రకాల బడా వ్యాపారాలు, కాంట్రాక్ట్‌లను కట్టబెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదా కోసం చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌తో సహా దీక్షలో కూర్చోవాలని, తనకూ ఆ దీక్షలో చోటిస్తే కూర్చుంటానని వ్యాఖ్యానించారు. కాపుల ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలూ తమకు ముఖ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం రాజీలేని విధంగా పోరాడుతున్న అఖిల పక్షం వెనుక ఒక్క ఎమ్మెల్యే కూడా లేరంటూ ఎంతో హీనంగా చూసిన చంద్రబాబుకు ఇపుడు అదే అఖిల పక్షం కావల్సి వచ్చిందని విమర్శించారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు పడవలపై కాళ్ళు వేయకుండా సినిమా రంగం లేక రాజకీయ రంగంలో స్థిరంగా ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.