ఆంధ్రప్రదేశ్‌

‘అనంత’ ఐసీడీఎస్‌లో కీచక అధికారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 15 : తన కోరిక తీర్చకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ మహిళా ఉద్యోగినిపై బెదిరింపులకు పాల్పడుతున్న కీచక అధికారి ఉదంతమిది. అనంతపురం జిల్లా స్ర్తి, శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సదరు అధికారి, తన కింది స్థాయి ఉద్యోగినిపై కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికెళ్లినప్పటికీ ఆమెను సెల్‌ఫోన్ ద్వారా వేధించేవాడు. దీంతో ఆమె తన ఆవేదనను తండ్రికి చెప్పడంతో పాటు అందుకు సంబంధించి ఫోన్‌లో వాయిస్ రికార్డులను వినిపించింది. దీంతో ఆమె తండ్రి సదరు అధికారిని తీవ్రంగా హెచ్చరించడంతో పాటు ఉన్నతాధికారులు, పోలీసులకు వౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయినా ఆ అధికారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ అధికారికి అధికార పార్టీ అండదండలు ఉండటంతో పలువురు అధికారులు, రాజకీయ నాయకులు మధ్యస్థం చేస్తూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటన స్వయంగా మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే జరుగుతుండటంపై ఐద్వా నాయకురాళ్లు ధ్వజమెత్తారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి అధికారిపై తక్షణం విచారణ జరిపి, సస్పెండ్ చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సావిత్రి ఆదివారం డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.